2024 ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీ రాజకీయాల్లో( AP Politics ) విమర్శలు హద్దులు దాటుతున్నాయి.పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా ఊహించని ఆరోపణలు చేస్తుండటంతో వైసీపీ నుంచి సైతం అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి.
వైసీపీ తరపున ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి( Posani Krishna Murali ) మరోసారి పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

వాస్తవానికి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చాలా మంచోడని అయితే చంద్రబాబు నాయుడు పవన్ ను చెడగొడుతున్నాడని పోసాని పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ కు అబద్ధం చెప్పడం చేత కాదని పవన్ కళ్యాణ్ అబద్ధం చెబుతుంటే అతని ముఖంలో తెలిసిపోతుందని పోసాని అన్నారు.చంద్రబాబు, లోకేశ్( Nara Lokesh ) లకు మాత్రమే అబద్ధాలు బాగా చెప్పడం వచ్చని జగన్ ప్రజలకు చేసే మేలును ఓర్వలేక చంద్రబాబు పవన్ ను జగన్ పై ఉసిగొల్పుతున్నాడని ఆయన పేర్కొన్నారు.
పవన్ సినిమాలలో రాజులాంటివాడే కానీ రాజకీయాలలో మాత్రం కింగ్ కాదని పోసాని అన్నారు.చెప్పుడు మాటలు విని పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను పాడు చేసుకోవడం సరి కాదని పోసాని వెల్లడించారు.
పోసాని చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పోసాని కామెంట్లపై( PPosani Comments ) భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం ఘాటుగా విమర్శలు చేస్తుండగా ఆ విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేయగా తాజాగా పవన్ సచివాలయ వ్యవస్థను సైతం టార్గెట్ చేసి విమర్శలు చేశారు.పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్( Social Media ) అవుతున్నాయి.
పోసాని పవన్ పై విమర్శలు చేయడం వల్ల ఆయనకు అవకాశాలు తగ్గుతాయని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







