ఈ లేడీ కానిస్టేబుల్ మనస్సుకు ఫిదా కావాల్సిందే.. తల్లి పరీక్ష రాసే సమయంలో పాపను లాలిస్తూ?

మనలో కొంతమందికి పోలీసులు కొంతమేర కఠినంగా ఉంటారనే అభిప్రాయం ఉంటుంది.పోలీసులతో మాట్లాడాలంటే చాలామంది భయపడతారు.

 Gujarat Conistable Dayaben Kind Herat Details Here Goes Viral , Gujarat Conista-TeluguStop.com

అయితే పోలీసులలో ఎక్కుమంది ప్రజల కష్టాలను తీర్చడం కోసం ఎన్నో రిస్క్ లను తీసుకుంటూ ఉంటారు.తాజాగా ఒక లేడీ కానిస్టేబుల్( Lady Constable ) చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండగా నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా గుజరాత్( Gujarat ) రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో గుమస్తా ఉద్యోగాలకు( Clerk Jobs ) సంబంధించి పరీక్ష జరగగా ఒక తల్లి ఆరు నెలల బిడ్డతో పరీక్షకు హాజరైంది.తల్లి పరీక్ష రాస్తున్న సమయంలో పరీక్ష కేంద్రం దగ్గర ఉన్న లేడీ కానిస్టేబుల్ బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని లాలించడం గమనార్హం.

కానిస్టేబుల్ దయా బెన్( Daya Ben ) బిడ్డ ఏడుపును విని తల్లి పరీక్షకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆరు నెలల చిన్నారిని కంటికి రెప్పలా చూసుకున్నారు.

పరీక్ష రాసే వరకు నీ బిడ్డ బాధ్యత నాది అంటూ హామీ ఇచ్చి ఆ తల్లి టెన్షన్ ను తీర్చారు.ఒకవైపు విధులను నిర్వహిస్తూ మరోవైపు బిడ్డను చూసుకుంటూ తన గొప్పదనాన్ని చాటుకున్నారు.అహ్మదాబాద్ పోలీసులు అధికారిక ట్విట్టర్ ఖాతాలో కానిస్టేబుల్ బిడ్డను ఆడిస్తున్న ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇలాంటి పోలీసులు సమాజానికి ఎంతో అవసరమని కామెంట్లు వినిపిస్తున్నాయి.పరీక్ష పూర్తైన తర్వాత పరీక్ష రాసిన మహిళ సదరు లేడీ కానిస్టేబుల్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఆ లేడీ కానిస్టేబుల్ ను ఎంతలా అభినందించినా తక్కువేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ లేడీ కానిస్టేబుల్ లా ఇతర పోలీసులు ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సామాన్య ప్రజలు దయా బెన్ మంచితనానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube