తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda) బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన బేబీ మూవీ( Baby Movie ) ముందు నుండి భారీ అంచనాలను పెంచుకుంటూ వచ్చింది.
ఈ సినిమాను ప్రముఖ రచయిత దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించాడు.కలర్ ఫోటో లాంటి అందమైన సినిమాకు కథ ఇచ్చిన సాయి రాజేష్ లవ్ స్టోరీ తెరకెక్కించడంతో ముందు నుండి మంచి హైప్ ఉంది.

ఈ సినిమా జులై 14న రిలీజ్ అయ్యింది.ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్స్( USA ) పడ్డాయి.బాక్సాఫీస్ దగ్గర ఒక చిన్న సినిమాగా వచ్చి ఇప్పుడు పెద్ద సినిమా అంత హైప్ తెచ్చుకుంది.ఈ సినిమా చిన్న సినిమా అయినప్పటికీ వచ్చిన క్రేజ్ మాత్రం భారీగా ఉంది అనే చెప్పాలి.
ముందు నుండి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ సినిమాకు ఓవర్సీస్ లో కూడా మంచి హైప్ పెరిగింది.

మరి ఈ లవ్ స్టోరీ కోసం యూత్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తుండగా ఎట్టకేలకు ఈ రోజు రిలీజ్ అయ్యింది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ కి సాలిడ్ రెస్పాన్స్ అందుకుందట.ఈ సినిమాలో అంతా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న నటీనటులు, కొత్త వారే ఉన్న కూడా లవ్ స్టోరీ కావడం ముందు నుండు ప్రమోషన్స్ తో హైప్ పెరగడం వంటివి ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.
మరి ఈ సినిమా యూఎస్ లో రిలీజ్ అవ్వగా ప్రీమియర్స్ ద్వారానే సుమారు లక్ష డాలర్స్ గ్రాస్ ప్రీమియర్స్ కు వచ్చింది అని తెలుస్తుంది.ఇంత మొత్తాన్ని టీమ్ కూడా ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో సంతోషంగా ఉంది.
చూస్తుంటే ఈ సినిమా సరికొత్త రికార్డులను నెలకొల్పేలా ఉంది.ఎట్టకేలకు ఆనంద్ దేవరకొండకు మంచి విజయం అందుకునే అవకాశం అయితే లభించింది.







