వైరల్: కంటికి కనబడిన లగ్జరీ కారుని కొనేసిన దుబాయ్‌ షేక్‌.. అక్కడి ప్రభుత్వం ఏం చేసిందంటే?

నేటి దైనందిత జీవితంలో ఓ సామాన్యుడు బైక్‌ కొనాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.అయితే పరిస్థితులు ఎలాగున్నా ఇక్కడ కొంతమంది జీవన విధానం ఎలాగుంటుందంటే తమకి నచ్చిన వస్తువుని 5 నిముషాల్లో సొంతం చేసుకుంటారు.

 Viral The Sheikh Of Dubai ,who Bought , Luxury Car , In Sight, What Did The, Gov-TeluguStop.com

అలాంటివారిలో మనకు తరచూ వినబడుతున్న పేర్లు దుబాయ్ షేక్స్( Dubai Shakes ).అవును, బాగా డబ్బున్నవారిగా పేరుమోసిన వీరు విలాసాలకు పెట్టింది పేరు.అప్పుడే మార్కెట్లోకి అడుగుపెట్టిన కారు వీరి ఇంటి గ్యారేజిలో ఉండాల్సిందే.దానికి సంబందించిన వీడియోలు కూడా మనం తరచూ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం.అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం అంతకుమించి అని చెప్పుకోవచ్చు.

అవును, ఇక్కడ వీడియోని గమనిస్తే ఓ వ్యక్తి అదేదో సంతలో కూరగాయలు కొన్నంత సులభంగా విలాసవంతమైన కార్లు కొనేస్తున్నాడు.అంతేకాదు, అక్కడ ఉద్యోగం చేస్తున్న సిబ్బందికి టిప్ రూపంలో నోట్ల కట్టలు విసిరేస్తున్నాడు.దాంతో దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అస్సలు ఇక్కడ మనకు కనబడుతున్న దుబాయ్ షేక్ ఒరిజినల్ షేక్ కాదట.

ఇపుడు చాలామంది ఫేమస్‌ అవ్వడం కోసం సోషల్ మీడియాలో విచిత్రమైన చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసినదే.ఈ క్రమంలోనే ఓ వ్యక్తి చేసిన హడావుడిని ఇక్కడ వీడియోలో చూడవచ్చు.

విషయం ఏమిటంటే ఇది నిజమైన వీడియో కాదని, ఫేక్ వీడియో అని గుర్తించిన దుబాయ్ ప్రభుత్వం అతగాడిపై కన్నెర్రజేసింది.దుబాయ్ షేక్‌ వేషధారణలో ఉన్న ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.దాంతో ఈ వీడియోలోని వ్యక్తిని దుబాయ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.వీడియోలో అతడు దుబాయ్ సంప్రదాయ దుస్తులను ధరించి ఈ చర్యకు పాల్పడడంతో అతనిపైన కేసు నమోదు చేసారు.

అతను ఇలా ప్రవర్తించడం ఎమిరాటీ అని పిలువబడే ఇస్లామిక్ సమూహానికి( Islamic group ) అవమానంగా పరిగణించబడుతుంది.దీంతో వీడియోపై ఫిర్యాదు అందింది.వీడియో తీసిన కార్ షోరూమ్ యజమానిని కూడా ఈ విషయమై విచారణకు పిలిచినట్టు కూడా తెలుస్తోంది.విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

https://twitter.com/i/status/1678125502190452737
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube