ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వం పైనా, జగన్( cm JAGAN ) పైన టార్గెట్ పెట్టుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీసే విధంగా విమర్శలు చేస్తూ, ఈ వ్యవహారంలో జగన్ ను దోషిగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయినా జగన్ మాత్రం ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు.పూర్తిగా రాబోయే ఎన్నికలపైనే జగన్ ఫోకస్ పెట్టారు.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాను ధీమాను వ్యక్తం చేస్తూ, ఈ మేరకు పార్టీ శ్రేణులను ఎన్నికల మూడ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
నిన్న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో జగన్ కీలక సూచనలే చేశారు.నెలల్లోకి వచ్చేసాం.ఎనిమిది, తొమ్మిది నెలల్లోనే ఎన్నికలు ఉంటాయి.
మీ జిల్లాల బాధ్యత మీదే.జగనన్న సురక్ష చాలా బాగా జరుగుతుంది.
దీంతో పార్టీకి ప్రభుత్వానికి మంచి మైలేజ్ వస్తోంది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలంతా పాల్గొనేలా చూడండి.
గడపగడపకు మన ప్రభుత్వ( Gadapa Gadapa Ku Mana Prabutvam ) కార్యక్రమంలో మిగిలిపోయిన ఇళ్లకు తిరగండి అంటూ జగన్ మంత్రులకు సూచించారు.ప్రజలకు మరింత చేరువ కావాలి, లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం కనిపించాలి.
జగనన్న సురక్షలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో మండల స్థాయి అధికారుల బృందాలు నిర్వహిస్తున్న క్యాంపుల్లో మంత్రులు పాల్గొనాలి.అక్కడికి వస్తున్న జనంతో మాట్లాడాలి.ఎమ్మెల్యేలంతా భాగస్వామ్యం అయ్యేలా మంత్రులు చూడాలి.క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో మీ భాగస్వామి ఉండాలి.పార్టీలను చూడకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూడాలంటూ జగన్ సూచించారు.గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంకా చురుగ్గా పాల్గొనాలి.
పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో మరింత ఆదరణ పెంచుకునే విధంగా ప్రయత్నించాలని జగన్ సూచించారు.
ఒకపక్క ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తో పాటు, జనసేన పూర్తిగా వైసీపీ( YCP )ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ, ఎన్ని రకాలుగా కవ్వింపు చర్యలకు దిగుతున్నా, జగన్ మాత్రం సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారంతా తిరిగి మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకువస్తారు అనే నమ్మకంతోనే ఉన్నారు.
అందుకే పూర్తిగా ఎన్నికలపైనే ఆయన దృష్టి సారిస్తూ, విమర్శలు, ఇతర వ్యవహారాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనట్లుగానే జగన్ కనిపిస్తున్నారు.