సలార్ హక్కుల వెనుక ఆ భయం కారణమా.. ఆ సంస్థలు ప్రభాస్ కు షాకిచ్చాయా?

స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas )సినీ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుపుకున్న సినిమా ఏదనే ప్రశ్నకు సలార్ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తోంది.ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 170 కోట్ల రూపాయల నుంచి 180 కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్నాయి.

 Shocking Facts About Salaar Movie Details Here Goes Viral In Social Media , Sala-TeluguStop.com

గతంలో పలు సినిమాలను కమిషన్, అడ్వాన్స్ పద్ధతులలో రిలీజ్ చేసిన ఈ సినిమా మేకర్స్ సలార్ సినిమాను మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతున్నారు.

సలార్ రిజల్ట్ పై నమ్మకం లేక మేకర్స్ ఈ విధంగా చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతుండగా అన్ని ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరికింది.ఓటీటీ సంస్థల షాకింగ్ డెసిషన్ వల్లే సలార్ నిర్మాతలు ఈ విధంగా చేస్తున్నారు.ప్రముఖ ఓటీటీ ( OTT )సంస్థలు ఎంత పెద్ద సినిమా అయినా 125 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసి డిజిటల్ హక్కులు తీసుకోకూడదని నిబంధనను పెట్టుకున్నాయట.

సలార్ నిర్మాతల పాలిట ఈ నిబంధన శాపంగా మారిందని తెలుస్తోంది.సలార్ ఓటీటీ హక్కులకు భారీ మొత్తం వస్తాయని భావించిన నిర్మాతలకు ఈ రూల్ వల్ల బేరం తెగడం లేదని భోగట్టా.

సలార్ సినిమా ( Salaar )నిర్మాతలు ఓటీటీ భారం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సినిమా హక్కులను అమ్మాల్సి వచ్చిందని సమాచారం అందుతోంది.సలార్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సలార్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.ప్రభాస్ సీన్లకు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయని భోగట్టా. కేజీఎఫ్2 సినిమాలకు, సలార్ సినిమాకు లింక్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సలార్ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.సలార్ కమర్షియల్ గా కలెక్షన్ల లెక్కలు మార్చాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube