సమాజంలో ఆడవారికి రోజురోజుకు రక్షణ కరువవుతోంది.వయసుతో సంబంధం లేకుండా చాలామంది అభం శుభం తెలియని మైనర్ ఆడపిల్లల నుంచి వయసు పైబడిన మహిళల వరకు కామాంధుల వలలో చిక్కుకొని అత్యాచారాలకు గురవుతున్నారు.
ఇలాంటి కోవలోనే ఓ వ్యక్తి తన ఇంటిని అద్దెకు ఇచ్చి, ఆ అద్దె ఇంట్లో రహస్యంగా సీసీ టీవీ కెమెరాలను అమర్చాడు.కానీ అద్దెకు ఉండే యువతులకు అనుమానం వచ్చి అంతా పరిశీలిస్తే ఇంటి యజమాని నీచపు బుద్ధి బయటపడింది.
ఈ ఘటన హైదరాబాద్( Hyderabad ) నగరంలోని యూసుఫ్ గూడా సమీపంలో ఉండే వెంకటగిరి హైలం కాలనీలో చోటు చేసుకుంది.ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో పూర్తిగా చూద్దాం.

హైదరాబాద్ నగరానికి ఉద్యోగాల కోసం ఎంతోమంది యువతి యువకులు వచ్చి అద్దెకు గదులను తీసుకొని ఉంటున్నారు.ఈ కోవలోనే అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ యువతి, తన సోదరుడు, తన స్నేహితురాలితో కలిసి ఉద్యోగాల కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు.యూసుఫ్ గూడా సమీపంలో ఉండే వెంకటగిరి హైలం కాలనీలో సయ్యద్ సలీం అనే వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకున్నారు.ఇంటి యజమాని సయ్యద్ సలీం ఈ యువతులపై కన్నేశాడు.
ప్రతిరోజు ఈ యువతుల రాకపోకలను గమనిస్తూ ఉండేవాడు.

ఇక విద్యుత్ మీటర్ పేరుతో యువతులు ఉంటున్న గదిలో ఓ రహస్య కెమెరాలు ఏర్పాటు చేశాడు.గదిలోని దృశ్యాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సెల్ ఫోన్లో ఒక యాప్ వేసుకున్నాడు.రెండు ప్రత్యేక డిజిటల్ వీడియో రికార్డర్లు ఏర్పాటు చేసి ఒక దానిని యువతుల గదికి అనుసంధానం చేశాడు.
అయితే యజమాని సలీం( Salim ) ప్రవర్తన పై ఆ యువతులకు ఏదో తెలియని అనుమానం వచ్చింది.గదిని పూర్తిగా పరిశీలిస్తే డాబాపై ఓ సీసీ టీవీ కెమెరా కనిపించింది.
వెంటనే ఆ యువతులు ఇంటి ఓనర్ అయిన సయ్యద్ సలీం నిలదీశారు.అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సయ్యద్ సలీం అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి సెల్ ఫోన్, కెమెరా, డివిఆర్ లను స్వాధీనం చేసుకున్నారు.