టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి( Pawan Kalyan ) ఉన్న క్రేజ్ ఏంటో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.సినిమా బాగున్నా, బాగలేకపోయినా థియేటర్లకు వెళ్లి పవన్ కళ్యాణ్ రచ్చ సృష్టిస్తారు.
ఇంత లాయల్ ఫ్యాన్స్ ఈ స్టార్ హీరోకి తప్ప మరెవరికీ లేరంటే అతిశయోక్తి కాదు.అందుకేనేమో గతంలో వచ్చిన అతని సినిమాలు బాగోలేకపోయినా, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా అభిమానులు వాటిని తెగ చూసేసారు.
ఫలితంగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.అవేవో ఇప్పుడు తెలుసుకుందాం.
• కాటమరాయుడు

పవన్ కళ్యాణ్, శృతిహాసన్ ప్రధాన తారాగణంలో రూపొందిన కాటమరాయుడు సినిమా( Katamarayudu Movie ) బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది.ఈ సినిమా చూసిన విమర్శకులు ఇంత చేత సినిమా టాలీవుడ్ చరిత్రలో రాలేదని కూడా కామెంట్లు చేశారు.పవన్ కళ్యాణ్ అభిమానులు తప్ప మిగతావారు కూడా దీనిని విమర్శించారు.నిజానికి ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది.అందుకే మొదటి వారంలో కలెక్షన్ల పరంగా ఇది దుమ్మురేపింది.కిషోర్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తక్కువ సమయంలోనే రూ.100 కోట్లు క్రాస్ చేసి పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో చెప్పకనే చెప్పింది.
• అజ్ఞాతవాసి

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి( Agnathavasi ) టైలర్ సమయం నుంచి ప్రేక్షకుల్లో హైప్ పెంచేసింది.ఈ సినిమా షూటింగ్ టైమ్, రిలీజ్ టైమ్‌లో చాలా హంగామా కూడా నడిచింది.ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని పవన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ బాగా ఆశపడ్డారు కానీ వారికి నిరాశే ఎదురయింది.ఇందులో కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ లను హీరోయిన్లుగా త్రివిక్రమ్ తీసుకున్నాడు.2018 లో భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేశాడు.అయితే ఇది తొలి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం 100 కోట్లు కొల్లగొట్టింది.నెగిటివ్ టాక్ తెచ్చుకుని కూడా ఈ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేయడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమేనని చెప్పవచ్చు.కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఇలాంటి సాధారణ రికార్డ్స్ సాధ్యమవుతాయని కూడా అనవచ్చు.