సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”.( Guntur Kaaram ) ఈ సినిమా జనవరిలో స్టార్ట్ అవ్వగా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని భారీ గ్యాప్ తర్వాత మరో షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

అయితే ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తున్నారు.ఈ ఫైట్ సీక్వెన్స్ ను కెజిఎఫ్ సినిమాలకు కంపోజ్ చేసిన అనల్ అరసు ఆధ్వర్యంలో చేయనున్నారు.ఇదిలా ఉండగా థమన్( Thaman ) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు అని ప్రకటించారు.
అయితే ఈ మధ్య ఈ సినిమా నుండి థమన్ తప్పుకున్నాడు అని టాక్ వచ్చింది.

దీనిపై ఎవ్వరూ స్పందించక పోవడంతో ఇదే రూమర్ నిజమే అని అనుకున్నారు.అయితే తాజాగా ఈ సినిమా విషయంలో థమన్ మాట్లాడారు.ఈయన మాట్లాడుతూ.ఈ సినిమాపై వచ్చే రూమర్స్ అన్నిటిని కొట్టి పారేస్తూ.ఇవన్నీ వందంతులు అంటూ.ఏవి నమ్మవద్దు అంటూ ఈ సినిమాకు 6 నెలలు నుండి వర్క్ చేస్తున్నాం.ఏదైనా ఉంటే నిర్మాతలే అధికారికంగా ప్రకటిస్తారు కదా ప్రతీ గొట్టంగాడికి చెప్పాల్సిన పనిలేదంటూ చెప్పుకొచ్చాడు.
దీంతో ఈ సినిమాలో థమన్ ఫిక్స్ అయినట్టే అని చెప్పవచ్చు.







