నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.పిల్లల చదువుకుఅన్ని విధాలుగా అండగా ఉంటా.
బిఆర్ఎస్( BRS PARTY ) సీనియర్ నాయకులు డాక్టర్ గోలి మోహన్.రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పొలాల లత కుటుంబ సభ్యులను మంగళవారం బిఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ గోలి మోహన్ పరామర్శించారు.
పొలాల లత అనారోగ్యంతో మరణించి ఇద్దరు కుమారులు అనాధలయ్యారని సహాయం కోసం ఎదురుచూస్తున్నారని ఈ విషయం గ్రామ సర్పంచ్, గ్రామస్తులు డాక్టర్ గోలి మోహన్ దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించి ఈరోజు కిష్టంపేట గ్రామంలోని పొలాల లత ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.
.ఈ సందర్భంగా డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబం లో జన్మించిన పొలాల లత చిన్న వయసులోనే భర్తను కోల్పోయి ఇద్దరు కుమారులతో జీవనం కొనసాగిస్తుందని, బీడీ కార్మికురాలైన తనకి వైద్యానికి డబ్బులు లేక తీవ్ర అనారోగ్యం తో మరణించడం తీవ్రంగా కలిచి వేసిందని తన వంతు సహాయంగా కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి కుమారుల చదువుల పట్ల సుముఖంగా ఉన్నారన్న విషయం తెలుసుకుని వారి విద్యాభ్యాసానికి తన వంతు సహాయం ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
వేములవాడ నియోజకవర్గం లో బీడీ లపై ఆధారపడ్డ కార్మికులు క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారని ఇకముందు భవిష్యత్తులో ఇలాంటి మరణాలు సంభవించకుండా మెరుగైన వైద్యం అందించడానికి మరియు ఇండస్ట్రియల్ వృత్తులపై దృష్టి సారించే దిశ గా కావలసిన వసతులు కల్పించడానికి వేములవాడ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నానని అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతు ఇచ్చి గెలిపించడం ద్వారా ఆయన నూతన ప్రణాళికలతో విద్య, వైద్యం, ఆర్థిక అభివృద్ధి చెందేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా గ్రామస్తుల సమక్షంలో యువకుల సమక్షంలో తెలియజేశారు.