మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు( Ex Vice President Venkaiah Naidu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికాలో కంటే భారత్‌లో మైనారిటీలు( Indian Minorities ) సురక్షితంగా, సంతోషంగా వున్నారని చెప్పారు.
లౌకికవాదం భారతీయుల రక్తంలోనే వుందని వెంకయ్య నాయుడు అన్నారు.సోమవారం గ్రేటర్ వాషింగ్టన్ డీసీ ఏరియాలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఏషియన్ ఇండియన్ అసోసియేషన్స్( National Council of Asian Indian Associations ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
పాశ్చాత్య మీడియాలోని కొన్ని విభాగాలు కూడా భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండియాలో మైనారిటీల భద్రత గురించి దుష్ప్రచారం చేస్తున్నారని వెంకయ్య నాయుడు ఫైర్ అయ్యారు.
భారత్ మైనారిటీలను గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు.పాకిస్తాన్ వెళ్లాలని అనుకున్నవారు ఎప్పుడో ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోయారని.
ఇక్కడ (ఇండియా) వుండాలనుకున్నవారు వుండిపోయారని వెంకయ్య నాయుడు దేశ విభజన నాటి ఘటనలను గుర్తుచేశారు.ఇదే సమయంలో భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పాకిస్తాన్‌ను ఆయన హెచ్చరించారు.
జమ్మూకాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని వెంకయ్య స్పష్టం చేశారు.నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆసియన్ ఇండియన్ అసోసియేషన్స్ నిర్వహించిన రిసెప్షన్‌లో సిక్స్ ఆఫ్ అమెరికా వెంకయ్య నాయుడిని సత్కరించారు.
కాగా.గత కొన్నిరోజులుగా వెంకయ్య నాయుడు అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ వారాంతంలో ఫిలడెల్ఫియాలో జరిగిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) 41వ వార్షిక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన జీవనశైలిలో మార్పుల ప్రాముఖ్యతను వెంకయ్య నాయుడు ప్రస్తావించారు.
అలాగే మాతృభూమిని సంరక్షించుకోవాలని ఆయన సూచించారు.ఏఏపీఐ కార్యక్రమాలు మానసిక ఆరోగ్యం, శరీరానికి సంబంధించి కేంద్రీకృతమై వున్నాయని ఆయన పేర్కొన్నారు.
అలాగే పెన్సిల్వేనియా కన్వేన్షన్ సెంటర్‌లో జరిగిన 23వ తానా సభల్లోనూ( TANA ) పాల్గొన్న వెంకయ్య నాయుడు తెలుగు భాష గొప్పతనాన్ని ప్రస్తావించారు.ప్రపంచ భాషగా తెలుగుకు గౌరవం తీసుకొచ్చేందుకు తానా లాంటి సంస్థలు కృషి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి కోరారు
.