యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై హై లెవల్ కమిటీ విచారణ చేయనుంది.ఇందులో భాగంగా ప్రయాణికులతో పాటు రైల్వే సిబ్బంది నుంచి కమిటీ వివరాలను సేకరించనుంది.
ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు ప్రమాదంపై పూర్తి వివరాలను అధికారులు సేకరించనున్నారని తెలుస్తోంది.అయితే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఘటన ప్రమాదమా.? లేక కుట్ర కోణమా అనే దానిపై కూడా అధికారులు ఆరా తీయనున్నారు.కాగా ప్రమాదంలో ఏడు బోగీలు పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే.







