క్యాబేజీలో బ్యాక్టీరియా కుళ్ళు తెగులను అరికట్టేందుకు సస్యరక్షక పద్ధతులు..!

క్యాబేజీ( Cabbage ) పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగులలో కీలక పాత్ర పోషిస్తాయి.ఈ తెగుల లక్షణాలు నేలలో, పంట అవశేషాలలో జీవించి ఉంటాయి.

 Plant Protection Methods To Prevent Bacterial Rot In Cabbage..!, Cabbage, Bacter-TeluguStop.com

పొలంలో ఉపయోగించే పనిముట్లు పనిముట్లు, కీటకాల వల్ల బ్యాక్టీరియా కుళ్ళు తెగులు పంటలోకి ప్రవేశిస్తుంది.వాతావరణం లో తేమ శాతం అధికంగా ఉన్న, ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల మధ్యన ఉన్న ఈ తెగులవ్యాప్త్రి చాలా అధికంగా ఉంటుంది.

ఈ తెగులు సోకినప్పుడు ముందుగా క్యాబేజీపై నానినట్టు ఉండే మచ్చలు ఏర్పడతాయి.క్రమంగా విస్తరించి మృదువుగా మారుతాయి.ఈ మచ్చల కింది భాగంలో క్యాబేజీ లోపల నలుపు రంగు ఏర్పడుతుంది.ఈ తెగుల వ్యాప్తి విస్తృతంగా ఉన్నప్పుడు క్యాబేజీ మొక్క ఆకులు, కాండం, వేర్లు పూర్తిగా కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంది.

మేలు రకం తెగులు నిరోధక విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.సూర్యరశ్మి, గాలి మొక్కలకు బాగా తగిలే విధంగా మొక్కల మధ్య దూరం ఉండేటట్లు నాటుకోవాలి.మొక్కలకు గాయాలు తగలకుండా సాగు చేయాలి.పరిశుభ్రం చేసిన పనిముట్లను మాత్రమే పొలంలో ఉపయోగించాలి.ఎక్కడైనా వ్యాధి సోకిన మొక్కలు కనిపిస్తే వెంటనే తొలగించి నాశనం చేయాలి.పంట కోతలు పొడి వాతావరణంలో మాత్రమే చేయాలి.

పంట కూత తర్వాత పొలంలో మొక్కల యొక్క అవశేషాలు పూర్తిగా తొలగించి నాశనం చేయాలి.రెండు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి.

పొలంలో ఎప్పటికప్పుడు కలుపును నివారించే చర్యలు తీసుకోవాలి.బ్యాక్టీరియా( Bacteria ) వల్ల సోకే ఈ తెగులను రాగి ఆధారిత శిలింద్ర నాశిని లను ఉపయోగించి అరికట్టాలి.

సిప్రోఫ్లోక్సాసిన్( Ciprofloxacin ) తో ఈ తెగులను అరికట్టాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube