Avinash : తండ్రి కాబోతున్న ముక్కు అవినాష్.. అనుమానంలో నెటిజన్స్?

బుల్లితెరపై మంచి కమెడియన్ గా పేరు సంపాదించుకున్న ముక్కు అవినాష్( Avinash ) గురించి తెలుగు ప్రేక్షకులకులందరికీ తెలిసిందే.జబర్దస్త్ లో తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

 Avinash : తండ్రి కాబోతున్న ముక్కు అ-TeluguStop.com

అతి తక్కువ సమయంలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.జబర్దస్త్ కు ముందు మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేసిన అవినాష్.

అక్కడి నుండి జబర్దస్త్ లో అడుగు పెట్టి ఒక హోదాను సొంతం చేసుకున్నాడు.జబర్దస్త్ తోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న అవినాష్ ​వెండితెరపై కూడా అవకాశాలు అందుకున్నాడు.

ఇక బిగ్ బాస్ కోసం జబర్దస్త్ కు దూరమైన అవినాష్ పలు షోలలో మాత్రం పాల్గొని బాగా సందడి చేస్తున్నాడు.బిగ్ బాస్ హౌస్ లో తన కామెడీతో మరింత పరిచయాలు పెంచుకున్నాడు.

Telugu Anuja, Avinash, Jabardasth, Pregnant, Youtube-Movie

బిగ్ బాస్ తరువాత అవినాష్ మళ్లీ జబర్దస్త్ లో కాకుండా మిగతా షో లలో పాల్గొని బాగా సందడి చేశాడు.అంతేకాకుండా ఆయన అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు.పెళ్లి తర్వాత అవినాష్ లో చాలా మార్పులు వచ్చాయని చెప్పవచ్చు.తన భార్య అనూజను బుల్లితెర ప్రేక్షకులకు కూడా పరిచయం చేశాడు.అవినాష్ సోషల్ మీడియా( Social media )లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ.తన భార్య అనూజతో కలిసి ఫన్నీ వీడియోలను, తమ ఫోటోలను, ఇతర విషయాలను పంచుకుంటూ ఉంటారు.

యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుని అందులో నిత్యం ఏదో ఒక వీడియో పంచుకుంటూనే ఉంటారు.అప్పుడప్పుడు ప్రాంక్ వీడియోలు అంటూ జనాలని పిచ్చోళ్లను చేస్తారు.

Telugu Anuja, Avinash, Jabardasth, Pregnant, Youtube-Movie

ఇక మధ్య మధ్యలో తమ వీడియోలలో అవినాష్ తన భార్యని చూడకుండా కూడా బాగా కౌంటర్లు వేస్తూ ఉంటాడు.అలా వీరి వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయా.అంతే ఇదంతా పక్కన పెడితే.పెళ్లయిన ఇంత కాలానికి అవినాష్ దంపతులు తమ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు.తమ తల్లిదండ్రులం అవుతున్నామని యూట్యూబ్లో ఒక వీడియో పంచుకున్నారు.

Telugu Anuja, Avinash, Jabardasth, Pregnant, Youtube-Movie

త్వరలోనే తాము ముగ్గురం కాబోతున్నామని భార్య తన ప్రేగ్నెంట్ అని.ఇంట్లోకి త్వరలోనే ఓ బేబీ రాబోతుందని అన్నాడు.అక్టోబర్లో తమ పెళ్లి రోజు ఉందని.

ఇంకా పిల్లలను ఎప్పుడు కంటారు అంటూ మమ్మల్ని చాలామంది అడుగుతూ వచ్చారు.ఇదే వాళ్ళందరికీ సమాధానమని అన్నాడు.

తన భార్య తల్లి, తను తండ్రిని కాబోతున్నానని అన్నాడు.అయితే ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవ్వగా వీడియో చూసి జనాలు బాగా ట్రోల్స్, కామెంట్లు చేస్తున్నారు.

ఈసారైనా ప్రెగ్నెంట్ నిజమా కాదా అని అడుగుతున్నారు.ఎందుకంటే గతంలో వారు ప్రెగ్నెంట్ అంటూ ఒక ఫ్రాంక్ వీడియో చేశారు.

ఆ సమయంలో చాలామంది వారిపై మండిపడ్డారు.అయితే ఇప్పుడు మళ్లీ అటువంటి వీడియో షేర్ చేసుకోవడంతో ఇది నిజమా కాదా అని ఆరా తీస్తున్నారు.

ఇక మరి కొంతమంది వీడియోలు తీయడం అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube