టాలీవుడ్ లో అర్జున్ రెడీ( Arjun ready ) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda )తమ్ముడు అయిన ఆనంద్ దేవరకొండ కూడా ‘దొరసాని’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు… ఇతను మొదటి సినిమాతోనే మంచి నటుడు అనిపించుకున్నాడు.ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే చిత్రంతో డీసెంట్ సక్సెస్ అందుకున్నాడు.2020 లాక్ డౌన్ టైంలో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజ్ అయ్యింది.అటు తర్వాత ఇతను నటించిన ‘పుష్పక విమానం’( Pushpaka Vimanam ) కంటెంట్ పరంగా మెప్పించినా కమర్షియల్ గా సక్సెస్ అయితే అందుకోలేదు.

ఇక ‘హైవే’ సినిమా అయితే నేరుగా ఆహాలో రిలీజ్ అయ్యింది.ఇక ఆనంద్ దేవరకొండ నటించిన ‘బేబీ’ సినిమా వచ్చేవారం అంటే జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రం ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యి మంచి మార్కులు వేయించుకుంది.ఈ సినిమా ఆనంద్ కి మంచి సక్సెస్ అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా.సోషల్ మీడియాలో ఆనంద్ దేవరకొండ హీరోయిన్ వర్ష బొల్లమతో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
వీటి పై క్లారిటీ ఇచ్చాడు.

అతను మాట్లాడుతూ.“వర్ష బొల్లమ్మ( Varsha Bollamma ) నాకు బెస్ట్ ఫ్రెండ్.అంతే.! ఇందులో దాచడానికేం లేదు.మేం ఇద్దరం డాగ్ లవర్స్.కుక్కల గురించి ఎక్కువ మాట్లాడుతూ బాగా కనెక్ట్ అయిపోయాం.అలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం.
మేమిద్దరం కలిసి సినిమా చేసి 3 ఏళ్ళు అయ్యింది.అయినా ఇంకా టచ్ లోనే ఉన్నాం.
ఇంకా చెప్పాలంటే, వర్ష బొల్లమ్మ నాకు చాలా స్పెషల్ ఫ్రెండ్” అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఇక ఈ విషయాలు పక్కన పెడితే బేబీ సినిమా మీద ప్రస్తుతం ఆనంద్ చాలా హోప్స్ పెట్టుకున్నట్టు గా తెలుస్తుంది ఎందుకంటే ఆనంద్ కి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు అందుకే ఈ సినిమాతో ఆనంద్ కమర్షియల్ సక్సెస్ కొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…అందుకే ఈ సినిమా తో పక్క సక్సెస్ కొడతాను అని అంటున్నాడు ఆనంద్…