ఒక సామాన్య మనిషి కూడా మెగాస్టార్( Megastar ) అవ్వచ్చు అని నిరూపించిన ఒకే ఒక వ్యక్తి చిరంజీవి… ఈయన అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు.ఇక ఆ తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అక్కడ సక్సెస్ కాలేకపోయారు ఇక దాంతో మళ్ళీ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఖైదీ నెంబర్ 150 ( Khaidi No.150 )సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమా మంచి విజయం సాధించడం తో ఆయన ఇప్పుడు మళ్లీ వరుస సినిమా లు చేస్తున్నారు.ఇక రీసెంట్ గా వాల్తేరు వీరయ్య( Waltheru Veeraiah ) వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన చిరంజీవి.
త్వరలో `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది.ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ చిరంజీవికి సోదరి పాత్రలో కనిపించబోతోంది.
ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతోంది.ఈ సంగతి పక్కన పెడితే.ఒకానొక సమయంలో చిరంజీవి కెరీర్ పరంగా చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు.ముఖ్యంగా 1995లో విడుదలైన `అల్లుడా మజాకా` మూవీ తర్వాత చిరంజీవికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది.
బిగ్ బాస్, రిక్షావోడు, ఇద్దరు మిత్రులు, మృగరాజు, డాడీ ఇలా చాలా ఫ్లాపులు పడ్డాయి.నిలబెట్టిన చిత్రం `ఇంద్ర`( Indra ).చిరంజీవి కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ ఇది. బి.గోపాల్( B.Gopal ) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ ( C.Ashwanidat )ఈ చిత్రాన్ని నిర్మించారు.ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా 2002లో విడుదలై భారీ విజయం అందుకుంది.
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఆసక్తికర విషయం ఏంటంటే.
మొదట్లో చిరంజీవి ఫ్యాక్షన్ జానర్ సినిమాలు తనకు సూట్ కావని.ఇంద్ర సినిమాను రిజెక్ట్ చేశారట.
కానీ, డైరెక్టర్ బి.గోపాల్ మాత్రం ఈ కథకు మీరే పర్ఫెక్ట్ అంటూ చిరంజీవిని ఒప్పించారట.అలా పట్టాలెక్కిన ఇంద్ర చిరంజీవి కెరీర్ ను మళ్లీ పుంజుకునేలా చేసింది.ఇంద్ర సినిమానే కనుక లేకుంటే చిరంజీవి ఈపాటికే రిటైర్ అయ్యేవాడని కూడా కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు అంటుంటారు.
ఇక ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క ఇండస్ట్రీ హిట్ కొట్టాలేదు.