తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ అప్పట్లో హీరోయిన్ అనేపదానికి అర్థం చెప్పిన నటి సావిత్రి( Savitri ) గారు ఆమె చాలా అందం గా ఉండేది అలాగే ఆమె తమ నటన తో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది, ఇక తన జీవిత కాలంలో ఎన్నో ఎత్తు పళ్ళాలు,సుఖదుఃఖాలు ఉన్నాయి.
ఈమె సినిమాల్లోకి వచ్చి అటు తెలుగులో ఇటు తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి అప్పట్లోనే వేల కోట్ల ఆస్తులను సంపాదించి మహానటిగా కీర్తి సంపాదించింది.కానీ అలాంటి ఈ హీరోయిన్ స్వయంగా చేసిన కొన్ని తప్పుల వల్ల చివరికి దీనస్థితిలో మరణించింది.ఇక ఈమె పెళ్లయినవాడని తెలిసినా కూడా జెమినీ గణేషన్( Gemini Ganesan ) ని ప్రేమించి ఆయనకి రెండో భార్యగా వెళ్ళింది.
ఆ తర్వాత కొన్ని విషయాల్లో జెమినీ గణేషన్ తో మనస్పర్ధలు వచ్చి తాగుడుకు బానిసై తాగుడే లోకంగా మారి చివరికి ఉన్న డబ్బులన్నీ దాన ధర్మాలు చేస్తూ తాగుడికి ఖర్చుపెట్టి దీనస్థితిలో మరణించిన సంగతి మనకు తెలిసిందే.
అయితే అలాంటి సావిత్రి ని చివరి రోజుల్లో చాలామంది దూరం పెట్టారు అని ఎన్నో వార్తలు వినిపించాయి.అంతేకాదు ఎన్టీఆర్, ఏఎన్నార్( NTR, ANR ) వంటి స్టార్ హీరోలు కూడా సావిత్రిని దగ్గరికి తీయలేదు అని వార్తలు గట్టిగానే వినిపించాయి.కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదట.
ఎన్టీఆర్ ఏఎన్నార్లు తమ సహనటి అయిన సావిత్రి కోసం ఎంతో సహాయం చేశారట.ఒకానొక టైం లో సావిత్రి కి తినడానికి అలాగే ఉండడానికి కూడా డబ్బులు లేకపోతే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు నెల నెలా సావిత్రి కోసం కొన్ని డబ్బులు పంపించేవారట.
కానీ ఈ విషయం చాలా వరకు బయటకు రాలేదు.అయితే అప్పట్లో ఈ ఇద్దరు హీరోలు కూడా సావిత్రి పట్ల చాలా సానుభూతిని వ్యక్తం చేస్తూ వాళ్ళకి తోచిన సహాయం చేశారు.