ఈ ఏడాది విడుదల కానున్న సినిమాలలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా ఏదనే సర్వే నిర్వహిస్తే ఎక్కువమంది సలార్ ( Salar )సినిమా పేరును సమాధానంగా చెబుతున్నారు.టీజర్ లో ఈ సినిమా కథకు సంబంధించి ఎలాంటి విషయాలను రివీల్ చేయకపోయినా ఇచ్చిన క్లూస్ ఆధారంగా ప్రేక్షకులు తమకు నచ్చిన విధంగా కథలు అల్లేస్తున్నారు.
అయితే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సప్తగిరి( Saptagiri ) ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను రివీల్ చేశారు.
సలార్ సినిమా 2,000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని సప్తగిరి చేసిన కామెంట్లు ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
సలార్ టీజర్ కు ఇప్పటివరకు 106 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ ను పూర్తి చేశానని సప్తగిరి అన్నారు.సలార్ మూవీ రిజల్ట్ విషయంలో పూర్తి కాన్ఫిడెన్స్ ఉందని ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

సలార్ మూవీ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమాకు బిజినెస్ ద్వారా మూడు రెట్ల లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.సలార్ మూవీ కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తుందంటూ సప్తగిరి ఫస్ట్ రివ్యూ ఇచ్చేయగా ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.సప్తగిరి పోస్ట్ వల్ల ప్రభాస్ అభిమానులు సైతం తెగ సంతోషిస్తున్నారు.

2023 సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ గా సలార్ మూవీ నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్( Prabhas ) గత సినిమాలతో అంచనాలను అందుకోకపోయినా ఆ సినిమాలు వేరని సలార్ వేరని ఫ్యాన్స్ చెబుతున్నారు.అక్టోబర్ 23వ తేదీ ప్రభాస్ పుట్టినరోజు కాగా ఆరోజు ప్రభాస్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు రానున్నాయని భోగట్టా.ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, స్పిరిట్, మారుతి డైరెక్షన్ లో సినిమాతో బిజీగా ఉన్నారు.







