అక్కినేని యువ హీరోల్లో నాగ చైతన్య ( Naga Chaitanya )ఒకరు.అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగాడు.
అయితే ఈ మధ్య మళ్ళీ ఈయన టైం బాలేనట్టు అనిపిస్తుంది.థాంక్యూ, హిందీ డెబ్యూ సినిమా లాల్ సింగ్ చద్దా తాజాగా వచ్చిన కస్టడీ కూడా ఈయనను ప్లాప్స్ నుండి బయట పడేయలేక పోయాయి.
నాగ చైతన్య వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో కస్టడీ సినిమా చేయగా ఇది కూడా తీవ్ర నిరాశ పరిచింది.ఇక ఈ సినిమా తర్వాత చైతూ ఎలాంటి సినిమా చేస్తాడు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దీనిపై ఇప్పటి వరకు అఫిషియల్ అప్డేట్ రాలేదు.అయితే చందు మొండేటితో( Chandu mondeti ) తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు అని టాక్ వస్తుంది.

వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు( Dil Raju ) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీను తెరకెక్కించనున్నారని టాక్.ఇక ఈ సినిమాను గ్రాండ్ లెవల్లో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించనున్నట్టు టాక్ నడుస్తుంది.అంతేకాదు మినిమమ్ చైతన్య కోసం 60 కోట్లతో తెరకెక్కించనున్నారు అని టాక్.ఇదే నిజం అయితే నాగ చైతన్య కూడా పాన్ ఇండియన్ బాట పెట్టినట్టే అని చెప్పాలి.

ఇప్పటికే స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియన్ రేసులో ఉన్నారు.మరి చైతూ కూడా ఇప్పటికైనా పాన్ ఇండియన్ మూవీ చేస్తాడో లేదో చూడాలి.ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు చేసారు.ఈ రెండు కూడా మంచి విజయాలు అందుకున్నాయి.ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది.మరి ఈసారి ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.







