చైతూ కూడా పాన్ ఇండియా బాట.. త్వరలోనే భారీ ప్రాజెక్ట్ అనౌన్స్!
TeluguStop.com
అక్కినేని యువ హీరోల్లో నాగ చైతన్య ( Naga Chaitanya )ఒకరు.అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగాడు.
అయితే ఈ మధ్య మళ్ళీ ఈయన టైం బాలేనట్టు అనిపిస్తుంది.థాంక్యూ, హిందీ డెబ్యూ సినిమా లాల్ సింగ్ చద్దా తాజాగా వచ్చిన కస్టడీ కూడా ఈయనను ప్లాప్స్ నుండి బయట పడేయలేక పోయాయి.
నాగ చైతన్య వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో కస్టడీ సినిమా చేయగా ఇది కూడా తీవ్ర నిరాశ పరిచింది.
ఇక ఈ సినిమా తర్వాత చైతూ ఎలాంటి సినిమా చేస్తాడు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దీనిపై ఇప్పటి వరకు అఫిషియల్ అప్డేట్ రాలేదు.అయితే చందు మొండేటితో( Chandu Mondeti ) తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు అని టాక్ వస్తుంది.
"""/" /
వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు( Dil Raju ) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీను తెరకెక్కించనున్నారని టాక్.
ఇక ఈ సినిమాను గ్రాండ్ లెవల్లో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించనున్నట్టు టాక్ నడుస్తుంది.
అంతేకాదు మినిమమ్ చైతన్య కోసం 60 కోట్లతో తెరకెక్కించనున్నారు అని టాక్.ఇదే నిజం అయితే నాగ చైతన్య కూడా పాన్ ఇండియన్ బాట పెట్టినట్టే అని చెప్పాలి.
"""/" /
ఇప్పటికే స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియన్ రేసులో ఉన్నారు.
మరి చైతూ కూడా ఇప్పటికైనా పాన్ ఇండియన్ మూవీ చేస్తాడో లేదో చూడాలి.
ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు చేసారు.ఈ రెండు కూడా మంచి విజయాలు అందుకున్నాయి.
ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది.మరి ఈసారి ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.