Aishwarya Rajes : స్టార్ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఐశ్వర్య రాజేష్.. అది చూసే సెలెక్ట్ చేస్తారంటూ?

తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్.టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో అతని భార్యగా సువర్ణ పాత్రలో మెప్పించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

 Aishwarya Rajesh Made Shocking Comments About Star Heroes-TeluguStop.com

ఇక ఈ సినిమా సక్సెస్ ను ఇవ్వకపోగా తన పాత్రకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.

Telugu Dhanush, Dulquer Salmaan, Tollywood-Movie

ఇక తమిళంలో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.కెరీర్ మొదట్లో యాంకరింగ్ గా అడుగుపెట్టిన ఐశ్వర్య ఆ తర్వాత నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.మొదట తమిళ సినిమాలతో ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.

ఇక 2019లో మిస్ మ్యాచ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.హిందీ, మలయాళం సినిమాలలో కూడా నటించింది ఐశ్వర్య.

తమిళంలో స్టార్ హీరోల సరసన కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.అంతవరకు మామూలు గుర్తింపుతో సాగిన తన కెరీర్.విజయ్ సేతుపతి నటించిన కె/పి రణ సింగం లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.

Telugu Dhanush, Dulquer Salmaan, Tollywood-Movie

ఇదంతా పక్కన పెడితే తాజాగా స్టార్ హీరోలపై కొన్ని కామెంట్లు చేసింది.రీసెంట్ గా తను ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకుంది కాక ముట్టయి తర్వాత తనకు ఎవరు ఆఫర్స్ ఇవ్వలేదని.ఆ రీసన్ ఏంటో తనకు తెలియదని తెలిపింది.

తన కెరియర్ లో ఎన్నో సినిమాలు చేశానని.తనకు తన నటన వచ్చి ఛాన్స్ ఇచ్చిన హీరోలు మాత్రం ధనుష్, దుల్కర్ సల్మాన్, విజయ్ సేతుపతి, శివ కార్తికేయ.

మిగతా హీరోలు ఎవరు తనకు అవకాశం ఇవ్వలేదని తెలిపింది.

తనలో ఎంత టాలెంట్ ఉందో అందరికీ తెలుసని.

కథల విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా నిర్ణయం తీసుకుంటానని తెలిపింది.ఇక ఓ స్టార్ హీరో తన సినిమాలో హీరోయిన్ గా తీసుకునే ముందు ఆ హీరోయిన్ మార్కెట్, ఓటీటీ, డిజిటల్ శాటిలైట్ రైట్స్ ఇవన్నీ చూస్తారని.

ఇవన్నీ పరిగణలోకి తీసుకొని హీరోయిన్ ను తమ సినిమాల్లో పెట్టుకుంటారని అన్నది.

Telugu Dhanush, Dulquer Salmaan, Tollywood-Movie

అందుకే బహుశా తనను ఏ హీరో సెలెక్ట్ చేసుకోలేదేమో అంటూ తాము కోరుకున్న స్థాయికి ఎదగాలంటే కొన్ని కొన్ని సార్లు తిప్పలు తప్పవని.దేనికైనా సిద్ధంగా ఉండాలని.అందుకు నేను రెడీ అని.అందుకే లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేస్తున్నానని తెలిపింది.ఇక ఇప్పటికే 15 సినిమాలు చేశానని.

ఇకపై కూడా చేస్తానని.ఏ హీరో సపోర్ట్ చేయకపోయినా పర్లేదు తన సినిమాలో తానే హీరో అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిందట.

ప్రస్తుతం స్టార్ హీరోల పై ఆమె చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతుంది.ఇక తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు అని అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube