ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌కు( YouTube ) ఎంత క్రేజ్ వుందో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇపుడు ఏ చిన్న అవసరం వచ్చినా యూట్యూబ్ ఓపెన్ చేసే పరిస్థితి వుంది.
ఎందుకంటే ఇక్కడ వినియోగదారులకు అవసరమైన సమాచారం వీడియోల రూపంలో ఉంటుంది మరి.ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే యూట్యూబ్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.స్క్రీన్ లాక్( Screen lock ) పేరుతో వస్తున్న ఈ కొత్త ఫీచర్ యూజర్లకు మరింత మంచి అనుభవాన్ని పంచనుంది.

యూట్యూబ్‌లో వీడియో ప్లే సమయంలో అనుకోకుండా స్క్రీన్ టచ్ అవ్వడం ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే సమస్య కదా.దీని వల్ల వీడియో మధ్యలో ఆగిపోవడం లేదా ఫార్వర్డ్ అవ్వడం అనేది జరుగుతుంది.అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే యూట్యూబ్ కొత్త ఫీచర్‌ను( YouTube’s new feature ) తీసుకొస్తోంది.
స్క్రీన్ లాక్ పేరుతో యూట్యూబ్ ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుందన్నమాట.ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారని తెలుస్తోంది.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

వీడియోను ఫుల్ స్క్రీన్ మోడ్‌లో చూసే సమయంలో ఈ ఫీచర్‌ను అందరూ ఎనేబుల్ చేసుకోవచ్చు.స్క్రీన్‌పై ఎడమవైపు పైభాగంలో కనిపంచే ‘లాక్ స్క్రీన్’ను( Lock screen ) సెలక్ట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను వినియోగంలోకి తీసుకురావచ్చని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుందని వివిశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇకపోతే యువతలో యూట్యూబ్ కి వున్న క్రేజ్ అంతాఇంతా కాదు.సగటు యువతలో 99 శాతం మంది మొబైల్ కొన్నవెంటనే ఇన్స్టాల్ చేసే యాప్ ఏది అంటే అది ఒక్క యూట్యూబ్ నే.అంటే దానిని బట్టి అర్ధం చేసుకోవచ్చు యూట్యూబ్ మనవాళ్ళు ఏ స్థాయిలో వాడుతున్నారా అని!







