ఎలుక( Rat ) వానలో స్నానం చేస్తున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో జోరుగా వర్షం ( Rain ) పడుతుండగా.
ఒక ఎలుక స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.ఈ ఎలుక స్నానం చేయడం చూస్తుంటే షవర్ బాత్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.
తలమీద ముందున్న రెండు కాళ్లను చేతుల్లాగా తిప్పుతూ వాన చినుకులతో తల తడుపుకుంటున్నట్లుగా స్నానం చేస్తోంది.కొంతమంది దీనిని గమనించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఎలుక స్నానం( Rat Rain Bath ) చేస్తున్నట్లు అనిపిస్తుండంతో.ఈ ఆసక్తికర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.

వర్షం నీళ్లు ముఖంపై పడుతుంటే వాటిని తుడుచుకుంటూ ఈ ఎలుక స్నానం చేసింది.భారీ వర్షం పడుతుండగా.ఒక బొరియ నుంచి ఎలుక బయటకు వచ్చింది.ఇక ఏముంది మనుషుల్లాగే ఇలా స్నానం చేస్తూ కనిపించింది.వర్షం శరీరం మీద పడుతుండగా కడుక్కుంటూ మనుషుల్లాగే స్నానం చేసింది.తలతో పాటు శరీరం మొత్తాన్ని తుడుచుకుంది.
తల మీద మురికి మొత్తం పోయే వరకు కూడా స్నానం చేస్తూ కనిపించింది.ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, లైక్ వస్తున్నాయి.
ఈ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

ఎలుక ఎంత శభ్రత పాటిస్తుందో చూస్తుంటే మచ్చటగా ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తుండగా.వర్షంలో బాగా ఎంజాయ్ చేస్తుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ఎలుకకు స్నానం చేసే విధానం ఎవరు నేర్పించారో అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మనుషులను చూసే ఇలా స్నానం చేయాలని నేర్చుకుని ఉంటుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.మరికొందరు ఎలుకకు సబ్బు కూడా ఇచ్చి ఉంటే బాగుండేదని సెటైర్లు పేల్చుతున్నారు.
ఇలా నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.







