ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న దేవర సినిమా ( Devara movie )లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెల్సిందే.మత్స్యకారుల ఫ్యామిలీకి చెందిన అమ్మాయి గా జాన్వీ కపూర్ కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఇప్పటి వరకు జాన్వీ కపూర్ పాత్ర గురించి ఎలాంటి క్లారిటీ లేదు.కానీ దేవర సినిమా జాన్వీ కపూర్ కి తెలుగు లో ఒక మంచి బ్రేక్ ఇవ్వడం ఖాయం అనిపిస్తుంది.

బాలీవుడ్ లో జాన్వీ కపూర్( Janhvi kapoor ) అడుగు పెట్టి అయిదు సంవత్సరాలు అయ్యింది.ఇప్పటి వరకు ఆమె ఏ ఒక్క సక్సెస్ ను అందుకోలేదు.దాంతో ఈ సినిమా అయినా జాన్వీ కి సక్సెస్ ను తెచ్చి పెడుతుందా అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దేవర సినిమా యొక్క అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అందుకే ఈ సినిమా తో ఆమెకి సక్సెప్ పడాలి.పెద్దగా సక్సెస్ లు లేకున్నా కూడా వరుసగా ఆఫర్ల ను తెలుగు నుండి దక్కించుకుంటుంది.
కానీ ఏ ఒక్క దానికి కూడా ఆమె ఓ కే చెప్పక పోవడం చర్చనీయాంశం అయ్యింది.

హీరోయిన్ గా జాన్వీ కపూర్ యొక్క అందాల ఆరబోత దేవర సినిమా హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.జాన్వీ కపూర్ ఆ మధ్య ఒక స్టార్ హీరో సినిమా నుండి ఛాన్స్ వచ్చిందట.కానీ దేవర సినిమా విడుదల అయిన తర్వాత మాత్రమే తన తదుపరి సినిమా ఉంటుంది అంటూ అధికారికంగా చెప్పేసిందట.
హీరోయిన్ గా జాన్వీ కపూర్ కి ఉన్న క్రేజ్ బాలీవుడ్ లో తక్కువ.కానీ టాలీవుడ్ లో మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి.కనుక భారీ ఎత్తున పారితోషికం ఇస్తున్నారు.అయితే దేవర సినిమా సక్సెస్ అయితే జాన్వీ కపూర్ డబుల్ రెమ్యూనరేషన్ ( Remuneration )తీసుకునే అవకాశాలు ఉంటాయి.
అందుకే జాన్వీ వెయిట్ అండ్ సీ దోరణితో ఉన్నట్లుగా తెలుస్తోంది.దేవర సినిమా వచ్చే ఏడాది రాబోతున్న విషయం తెల్సిందే.







