పాక్‌లో ఒకవైపు ఆర్ధికమాంద్యం.. మరోవైపు వరదలు, విషయం ఇదే!

మన పొరుగు దేశం పాకిస్థాన్( Pakistan ) గురించి చెప్పేదేముంది? ప్రస్తుతం అక్కడ ఆర్ధికమాంద్యం( Economical Crisis ) రాజ్యమేలుతున్నవేళ అది చాలదన్నట్టు వరదలు( Floods ) ముంచేస్తున్నాయి.అయితే వరదలు అక్కడికి రావడం ఇది తొలిసారి మాత్రం కాదు.

 Pakistan Economic Crisis Deepens Amid Flash Floods Details, Pakistan, Economic R-TeluguStop.com

గతేడాది వచ్చిన వరదల నష్టాన్ని ఇంకా మర్చిపోక ముందే ఈ ఏడాది మరో సారి అక్కడ దారుణమైన ఉపద్రవం ముంచుకొచ్చింది.అవును, తాజాగా రుతుపవనాల కారణంగా పాక్‌ను భారీ వరదలు ముంచెత్తాయి.

దీనికి తోడు పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.దాంతో అక్కడ ఇప్పటి వరకు 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు.

Telugu Economic, Financial, Floods, Lahore, Latest, Nri, Pakistan, Pakistanflash

పాక్‌ జాతీయ విపత్తు నిర్వహణ విభాగం అధికారి ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ… ”జూన్‌ 25 నుంచి రుతుపవనాల కారణంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 50 మంది మృతి చెందారు.మరో 87 మంది తీవ్రంగా గాయపడడం జరిగింది!” అని ఓ ఆంగ్ల వార్తా సంస్థకు వెల్లడించారు.ఈ సారి వరదల్లో ఇప్పటి వరకు తూర్పు పంజాబ్‌ ప్రావిన్స్‌లో( East Punjab Province ) అత్యధిక మరణాలు సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

వీరిలో అత్యధిక మంది కరెంట్‌ షాక్‌, భవనాలు కూలి మరణించినట్టు భోగట్టా.వాయువ్య పాకిస్థాన్‌లోని షాంగ్ల జిల్లాలో గురువారం కొండచరియలు విరిగిపడి పలువురు మృతి చెందారు.8 మంది చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు.గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Telugu Economic, Financial, Floods, Lahore, Latest, Nri, Pakistan, Pakistanflash

ఇకపోతే, బుధవారం లాహోర్‌ నగరంలో( Lahore ) రికార్డు స్థాయిలో వర్షం పడింది.దాంతో నగరంలో 35 శాతం ఇళ్లకు విద్యుత్తు, నీటి సరఫరా నిలిచిపోయింది.రానున్న రోజుల్లో మరింత భారీగా వర్షపాతం నమోదవుతుందని.పంజాబ్‌లోని లోతట్టు ప్రాంతాల్లో వరదలు వస్తాయని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది.దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను భారీ సంఖ్యలో తరలిస్తున్నారు.గతేడాది వచ్చిన వరదల్లో పాకిస్థాన్‌ మూడోవంతు వరకు కొన్ని నెలలపాటు నీటిలో ఉండిపోయింది.

దాదాపు 1,700 మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారు.సుమారు 28 బిలియన్‌ డాలర్ల ఆస్తినష్టం జరిగిందని గణాంకాలు వెల్లడించాయి.

నాటి విపత్తులో దెబ్బతిన్న ప్రాంతాల పునర్‌నిర్మాణానికి 2-10 ఏళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube