పెళ్లంటే నూరేళ్ళ పంట.మరీ ముఖ్యంగా మన ఇండియాలో వివాహానికి చాలా పెద్ద పీట వేశారు.
ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలలో పెళ్లి అనే అంశానికి ప్రధమ తాంబూలం ఇచ్చారు.వేదమంత్రాల నడుమ ఇక్కడి పెళ్లిళ్లు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి.
డబ్బు ఉన్నా, లేకున్నా పెళ్లి మాత్రం ఇక్కడ చాలామంది చాలా గ్రాండ్ గా జరుపుకుంటూ వుంటారు.ఇక పెళ్లి ( wedding )అంటే ఇక్కడ ఆ సందడే వేరు.
పెళ్లంటే భాజాలు, భజంత్రీలు, విందుభోజనం, కళ్యాణమండపం, బంధువుల హడావిడి, ట్రిప్పులు, సెలవులు ఇలా ఎన్నో ఉంటాయి.ఈమధ్యకాలంలో చాలామంది డెస్టినేషన్ మ్యారేజ్( Destination Marriage ) చేసుకుంటున్నారు.
బీచ్ లకి దగ్గరగా, హెలికాప్టర్ లలో జరిగిన వివాహాలెన్నో మనం విన్నాం.

సోషల్ మీడియా వీడియోల్లో ఈ రకమైన వింత వివాహాలన్నీ మనం చూసాం.అయితే ఒక ప్రేమ జంట మాత్రం నీటి అడుగున వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.ఇక ఈ వివాహం పోలాండ్‌లో( Poland ) జరగగా ఈ వివాహం ఇప్పుడు వైరల్ అవుతుంది.
పోలండ్‌కు చెందిన ఎవా స్టారోన్స్కా, పావెల్ బుర్కోస్కి( Eva Staronska, Pawel Burkowski ) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే అందరిలా కాకుండా జీవితాంతం వీరి పెళ్లి గుర్తుండిపోవాలి అనుకున్నారు.
అనుకున్నదే తడవుగా అండర్ వాటర్ లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.ఈ నీటి అడుగున జరిగిన పెళ్ళికి 300 అతిధులు హాజరయ్యారు.
ఈ పెళ్లి గ్రాండ్ గా, విజయవంతంగా జరగడానికి 300 మంది డ్రైవర్లు సహాయం చేసారంట.

అది విషయం… ఈ ప్రేమ పెళ్లి అతిపెద్ద జలాశయం నీటి అడుగున జరగడం విశేషం.కాగా ఈ వివాహం అక్కడ ఓ 18 నిమిషాల పాటు జరిగింది.వివాహం చేసుకున్న జంట, పూజారి వాటర్ ప్రూఫ్ టెక్స్ట్‌లు సంకేత భాష వ్యవస్థను ఉపయోగించి నీటి అడుగున పరస్పరం మాట్లాడుకుంటున్నట్టు కూడా వినికిడి.దాంతో ఇప్పుడు అంతా ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు.నెటిజన్లు అయితే వావ్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఎన్నో పెళ్లిళ్లు చూసాం కానీ ఇలా నీటి అడుగున పెళ్లి చూడడం ఇదే మొదటిసారి అని కామెంట్లు పెట్టడం వారి వంతు అయింది.నీటిలో కూడా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అదిరిపోయేలా రెడీ అయ్యారని కూడా బయట మాట్లాడుకుంటున్నారు మరి.ఏంటి మరి! మీకు కూడా అలా పెళ్ళిచేసుకోవాలని వుందా? అయితే ఇక్కడ కామెంట్ చేయండి!
.






