ఇటీవలే చాలా మంది తమ అక్రమ సంబంధాలు బయటపడ్డాక కుటుంబ సభ్యులపై దారుణమైన హత్యలకు పాల్పడుతున్నారు.ఓ వివాహిత కూడా అక్రమ సంబంధం( Extramarital Affairs ) కొనసాగిస్తూ.
భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించింది.కానీ కథ అడ్డం తిరగడంతో అడ్డంగా బుక్కైంది.
ఈ ఘటన విజయనగరంలో చోటు చేసుకుంది.ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో పూర్తిగా చూద్దాం.
పోలీసులు( Police ) తెలిపిన వివరాల ప్రకారం.విజయనగరంలోని కుమ్మరి వీధిలో కోటరాజు తన భార్య శ్రీదేవి, పిల్లలతో నివాసం ఉంటున్నాడు.అయితే శ్రీదేవి గోక వీధికి చెందిన గంధవరపు రఘు తో కొంతకాలం క్రితం వివాహేతర సంబంధం పెట్టుకుంది.ఎంతకాలం ఇలా గుట్టు చప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగించాలి అని, భర్తను హత్య చేస్తే తన వివాహేతర సంబంధానికి అడ్డు అదుపు అనేది ఉండదు అని భావించింది.
ఈ విషయం తన ప్రియుడైన రఘు తో చర్చించి ఓ మాస్టర్ ప్లాన్ రచించింది.
వీరి ప్లాన్ లో భాగంగా రఘు ఓ ఆర్ఎంపి డాక్టర్ దగ్గర నుండి కొన్ని నిద్ర మాత్రలు తీసుకువచ్చి శ్రీదేవి చేతికి ఇచ్చాడు.శ్రీదేవి రాత్రి మటన్ బిర్యానీలో ఆ నిద్ర మాత్రలు కలిపి తన భర్తకు తినిపించింది.భర్త కోటరాజు నిద్రలోకి జారుకున్నాక ప్రియుడు రఘును ఫోన్ చేసి ఇంటికి రావాలని పిలిచింది.
అయితే రఘు ఒంటరిగా కాకుండా వరుసకు బామర్ది అయినా బొగ్గుల దిబ్బకు చెందిన కేత శ్రీనును వెంట తీసుకువచ్చాడు.పని ముగిశాక రూ.20 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఇక రఘు, శ్రీను ఇంటిలోనికి ప్రవేశించి వారు తెచ్చుకున్న నైలాన్ తాడు ను కోటరాజు మెడకు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా.కోటరాజుకు మెలుకువ వచ్చింది.వెంటనే కోటరాజు గట్టిగా కేకలు వేయడంతో రఘు, శ్రీను అక్కడి నుంచి పరారయ్యారు.
బాధితుడైన కోటరాజు బుధవారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడని, గురువారం టూ టౌన్ సీఐ సీహెచ్ లక్ష్మణరావు( CI Lakshmana Rao ) పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు.బాధితుడి ఫిర్యాదు మేరకు అతని భార్య శ్రీదేవితో పాటు రఘు, శ్రీను లను పోలీసులు అరెస్టు చేశారు.