దేశంలో వరుస పెట్టి రైలు ప్రమాద ఘటనలు( Train Accidents ) జరుగుతున్నాయి.గత నెలలో ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో దాదాపు 200 మందికి పైగా మరణించగా.900 మందికి పైగా గాయపడటం జరిగింది.ఈ ఘటన జరిగి నెల అయిన తర్వాత తాజాగా నేడు ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో ( Falaknama Express ) అగ్ని ప్రమాదం సంభవించింది.
హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఈ ట్రైన్ యాదాద్రి జిల్లా పగిడిపల్లిలోకి రాగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీంతో ఈ అగ్ని ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధమయ్యాయి.
వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యి ప్రాణనష్టం జరగకుండా ప్రయాణికులను దించేశారు.
అయితే దేశంలో జరిగిన వరుస రైలు ప్రమాద ఘటనలపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukhender Reddy ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.దేశంలో రైళ్లు ప్రమాద ఘటనలు మోదీ పాలనుకు నిదర్శనమని సెటైర్లు వేశారు.పొలిటికల్ మైలేజ్ కోసం ఎన్నికల ముందు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ మతతత్వ పార్టీ… బీఆర్ఎస్ లౌకికవాద పార్టీ అని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కూడా గుత్తా సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.దేశంలో ప్రతిపక్షాలను చీల్చి.ప్రభుత్వాలను కూలుస్తున్నరు అంటూ బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ పై మండిపడ్డారు.
తెలంగాణపై కేంద్రానిది కక్ష పూరిత వైఖరి.అంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.