బుల్లితెరపై కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విరూపాక్ష.. రేటింగ్ ఎంతంటే?

ఈ మధ్య కాలంలో బుల్లితెరపై చాలా సినిమాలు మంచి రేటింగ్ ను సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నాయి.ఓటీటీల హవా అంతకంతకూ పెరుగుతుండటంతో బుల్లితెరపై హిట్ సినిమాలు సైతం మంచి రేటింగ్ ను సొంతం చేసుకోలేదు.

 Saitej Virupaksha Movie Trp Rating Details Here Goes Viral In Social Media Detai-TeluguStop.com

అయితే విరూపాక్ష( virupaksha movie ) మూవీ థియేటర్లలో హిట్ గా నిలవడంతో పాటు బుల్లితెరపై మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.ఈ సినిమాకు ఏకంగా 11.68 రేటింగ్ వచ్చింది.

కార్తీకదండు డైరెక్షన్ లో తెరకెక్కిన విరూపాక్ష మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం గమనార్హం.

అజనీష్ లోక్ నాథ్ ( Ajaneesh Loknath )ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం గమనార్హం.సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కింది.సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.సుకుమార్ కథనం ఇవ్వడం వల్లే విరూపాక్ష మూవీ సక్సెస్ సాధించిందని చాలామంది భావిస్తారు.

Telugu Ajaneeshloknath, Pawan Kalyan, Sai Dharam Tej, Samyuktha Menon, Tolltwood

సాయితేజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ ( Bro movie )ఈ నెల 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.బ్రో సినిమా వినోదాయ సిత్తం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.సముద్రఖని ఈ సినిమాతో తెలుగులో కూడా పాపులారిటీని మరింత పెంచుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడం కోసం సముద్రఖని చాలా కష్టపడ్డారని బోగట్టా.

Telugu Ajaneeshloknath, Pawan Kalyan, Sai Dharam Tej, Samyuktha Menon, Tolltwood

మరోవైపు వారసుడు మూవీ జెమిని ఛానల్ లో ప్రసారం కాగా ఈ సినిమాకు 4.12 రేటింగ్ వచ్చింది.జెమిని ఛానల్ కు ఇతర ఛానెళ్లతో పోల్చి చూస్తే రీచ్ తక్కువ కావడంతో ఈ సినిమాకు రేటింగ్స్ తగ్గాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విజయ్ వారసుడు సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చినా బుల్లితెరపై మాత్రం ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

సాయితేజ్ బ్రో సినిమాతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube