బుల్లితెరపై కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విరూపాక్ష.. రేటింగ్ ఎంతంటే?
TeluguStop.com
ఈ మధ్య కాలంలో బుల్లితెరపై చాలా సినిమాలు మంచి రేటింగ్ ను సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నాయి.
ఓటీటీల హవా అంతకంతకూ పెరుగుతుండటంతో బుల్లితెరపై హిట్ సినిమాలు సైతం మంచి రేటింగ్ ను సొంతం చేసుకోలేదు.
అయితే విరూపాక్ష( Virupaksha Movie ) మూవీ థియేటర్లలో హిట్ గా నిలవడంతో పాటు బుల్లితెరపై మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.
ఈ సినిమాకు ఏకంగా 11.68 రేటింగ్ వచ్చింది.
కార్తీకదండు డైరెక్షన్ లో తెరకెక్కిన విరూపాక్ష మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం గమనార్హం.
అజనీష్ లోక్ నాథ్ ( Ajaneesh Loknath )ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం గమనార్హం.
సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కింది.సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.
సుకుమార్ కథనం ఇవ్వడం వల్లే విరూపాక్ష మూవీ సక్సెస్ సాధించిందని చాలామంది భావిస్తారు.
"""/" /
సాయితేజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ ( Bro Movie )ఈ నెల 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
బ్రో సినిమా వినోదాయ సిత్తం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.సముద్రఖని ఈ సినిమాతో తెలుగులో కూడా పాపులారిటీని మరింత పెంచుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడం కోసం సముద్రఖని చాలా కష్టపడ్డారని బోగట్టా. """/" /
మరోవైపు వారసుడు మూవీ జెమిని ఛానల్ లో ప్రసారం కాగా ఈ సినిమాకు 4.
12 రేటింగ్ వచ్చింది.జెమిని ఛానల్ కు ఇతర ఛానెళ్లతో పోల్చి చూస్తే రీచ్ తక్కువ కావడంతో ఈ సినిమాకు రేటింగ్స్ తగ్గాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
విజయ్ వారసుడు సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చినా బుల్లితెరపై మాత్రం ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
సాయితేజ్ బ్రో సినిమాతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.
అనిల్ రావిపూడి రజినీకాంత్ తో సినిమా చేస్తున్నాడా..?