సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో సరికొత్త యాప్స్ అందుబాటులోకి రావడంతో చాలామంది సెలబ్రిటీలు వివిధ ఖాతాలను ఓపెన్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులకు దగ్గరవుతున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ఇంస్టాగ్రామ్( Instagram ) ఫేస్ బుక్ ( Face Boo k) ట్విట్టర్ (Twitter) వంటి వాటి ద్వారా సెలబ్రిటీలు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
అయితే తాజాగా మరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది.పోటీగా మెటా అధినేత జూకర్ బర్గ్ సరికొత్తగా ‘థ్రెడ్స్’ యాప్ ( Threads App ) అందుబాటులోకి తీసుకువచ్చారు.
థ్రెడ్స్ యాప్ ప్లేస్టోర్‌లో అందుబాటులోకి వచ్చిన తొలి రెండు గంటల్లోనే రెండు మిలియన్ల మంది, నాలుగు గంటల్లో ఐదు మిలియన్ల మంది డౌన్‌లోడ్‌లు చేసుకున్నారు.

ఈ విధంగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య నిమిషం నిమిషానికి అధికమవుతోంది.అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)సైతం ఈ థ్రెడ్స్ యాప్ లోకి అడుగు పెట్టారని తెలుస్తోంది.ఇలా ఈ సరికొత్త ఆప్ లోకి అడుగుపెట్టిన తొలి బాలీవుడ్ హీరోగా ఎన్టీఆర్ గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ విధంగా ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్ లో జాయిన్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ వెంటనే వారు కూడా ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్నారు.

ఇక ఎన్టీఆర్ ఈ సరికొత్త యాప్ లోకి అడుగుపెట్టిన కొంత సమయానికి ఈయనకు విపరీతమైన ఫాలోవర్స్ పెరిగిపోయారు.ఇప్పటికే ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ వంటి వాటి ద్వారా అభిమానులను సందడి చేస్తున్నటువంటి ఎన్టీఆర్ ఇకపై ఈ యాప్ ద్వారా కూడా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ యాప్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్స్ కలగలిసి ఉంది.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన కొరటాల శివ ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర ( Devara ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.







