బాలయ్య బాబు సినిమా వచ్చిందంటే మాస్ లో ఒక జాతర స్టార్ట్ అవుతుంది.అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల ఉచ్చ కోత మొదలవుతుంది…సరిగ్గా ఈ ఇయర్ సంక్రాంతి కి అదే జరిగింది.
బాలయ్య ( Balakrishna )హీరోగా గోపి చంద్ మలినేని దర్శకత్వం లో వచ్చిన వీర సింహ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది…ఈ సినిమాకి మొదట మిక్సుడ్ టాక్ వచ్చినప్పటికీ లాంగ్ రన్ లో మాత్రం ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ తో రచ్చ చేస్తుంది…ఇక బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తీ చేసుకున్న తర్వాత కూడా సినిమా ఒక థియేటర్ లో…పరుగును ఇంకా కొనసాగించి ఇప్పుడు ఏకంగా 175 రోజులను బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తీ చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి.
వీర సింహా రెడ్డి సినిమా( Veera Simha Reddy ) 175 రోజులను ఆంధ్రప్రదేశ్ లో కర్నూలులో ఆలూరు ప్రాంతంలో శ్రీ లక్ష్మీ నరసింహా ( Lakshmi Narasimha ) థియేటర్ లో.ఇప్పుడు 175 రోజులను పూర్తీ చేసుకోవడం విశేషం అని చెప్పాలి.ఓవరాల్ గా జస్ట్ యావరేజ్ రివ్యూలతో కూడా సంక్రాంతి హెల్ప్ తో ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో భారీ హిట్ గా నిలిచిన వీర సింహా రెడ్డి మొత్తం మీద బాలయ్యకి బాక్ టు బాక్ హిట్స్ పడేలా చేసింది.
ఇక ఇప్పుడు బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న తన కొత్త సినిమా భగవంత్ కేసరి సినిమా ( Bhagavanth Kesari )తో దసరాకి సందడి చేయబోతున్నాడు.ఆ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి…
.