మరో కొత్త పథకంతో.. ఎన్నికల ఎత్తులు వేస్తున్న కేసీఆర్ 

మూడోసారి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM kcr ) సామాజిక వర్గాల వారిగా బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.  ఎన్నికల్లో కలిసి వచ్చే అన్ని విషయాల పైన పూర్తిగా దృష్టి సారించారు.

 With Another New Scheme.. Kcr Is Making Electoral Gains ,telangana Government,-TeluguStop.com

తెలంగాణలో జరగబోయే ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, కెసిఆర్ కూడా విపక్ష పార్టీల కంటే ధీటుగా జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.కొత్త పథకానికి రూపకల్పన చేసి త్వరలోనే ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే దళిత బంధు పథకాన్ని బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వం అమలు చేస్తోంది.దీనిలో భాగంగా కుటుంబానికి 10 లక్షల చొప్పున అందిస్తున్నారు.

అదేవిధంగా బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టి వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గం ఓట్లను తమ ఖాతాలో వేసుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు.అయితే ఈ బీసీ బంధు పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి అనే విషయంపైనే కసరత్తు చేస్తున్నారు.

Telugu Bc Bandu, Congress, Dalitha Bandu, Telangana-Politics

దళిత బంధు పథకాన్ని అమలు చేయడంపై బీసీ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహంగా ఉంది అనే నివేదికలు అందడంతో బీసీ బంధు ను కేసీఆర్ తెరపైకి తీసుకువచ్చారు.అయితే ముందస్తుగా లక్ష సాయాన్ని అందించే విధంగా 14 బీసీ కులాలకు సాయం అందిస్తామని ప్రకటన చేశారు.అయితే దీనిపై మిగతా బీసీ కులాల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో కెసిఆర్ ఆలోచనలు పడ్డారు.వచ్చే ఎన్నికల్లో గెలుపోవటములను నిర్ణయించేది బీసీలే కావడంతో , వారి మద్దతు పొందేందుకు బీసీ బంధు( BC bandu ) ను తెరపైకి తీసుకువచ్చారు.

దీనిని త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా చేయాలి ? మార్గదర్శకాలు ఏ విధంగా రూపొందించాలనే విషయంపైనే ఇప్పుడు పూర్తిగా కసరత్తు చేస్తున్నారు.దళిత బంధు పథకం( Dalitha bandu ) కింద లబ్ధిదారులకు ప్రభుత్వం పది లక్షల సాయం అందిస్తోంది.అయితే బీసీ జనాభా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువగా ఉండటంతో, వారికి ఎంత అందజేయాలనే లెక్కలు వేసుకుంటున్నారు.

పది లక్షలు కాకుండా ఐదు లక్షల చొప్పున అందజేస్తే ఎలా ఉంటుందని విషయం పైన కెసిఆర్ అధికారులతో కసరత్తు చేస్తున్నారట.

Telugu Bc Bandu, Congress, Dalitha Bandu, Telangana-Politics

బడ్జెట్ లో ఎంత కేటాయించాలి ? బీసీ లలో ఏ ఏ కులాలకు కేటాయించాలనే దానిపైన చర్చిస్తున్నారట.ఈ పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం ద్వారా వచ్చే ఆదాయంతో ఈ పథకాన్ని అమలు చేయాలనే ప్లాన్ లో ఉన్నారట.బిజెపి కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఉండడంతో, ఆ సామాజిక వర్గంతో బీసీలకు న్యాయం జరగదని టిఆర్ఎస్ లోని న్యాయం జరుగుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీసీ బంధు ను  ఇప్పుడు కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube