ప్రపంచకప్ కోసం ముచ్చెమటలు కక్కుతున్న విరాట్ కోహ్లీ!

నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మరలా మైదానంలో అడుగు పెట్టనుంది.ఈ నెల 12 నుంచి విండీస్ పర్యటనను భారత్ స్టార్ట్ చేయనుంది.

 Virat Kohli Is Getting Excited For The World Cup, World Cup, Virat Kohli, Cricke-TeluguStop.com

ఈ పర్యటనలో భాగంగా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టి20లను ఆడనుంది.ఈ క్రమంలో రోహిత్ శర్మ( Rohit Sharma ) సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే కరీబియన్ దీవులకు( Caribbean Islands ) చేరుకుంది.

దాంతో ప్రస్తుతం టీమ్ నెట్స్ లో ప్రాక్టీస్ చేసే పనిలో నిమగ్నమైంది.ముఖ్యంగా విరాట్ కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో వైఫల్యం తర్వాత.మళ్లీ ఫామ్ లోకి రావాలని పట్టుదలగా ఉన్నాడు విరాట్.

ఈ క్రమంలో విండీస్ పర్యటనలో ఉన్న కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.

ప్రస్తుతం దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం గమనించవచ్చు.అశ్విన్, జైదేవ్ ఉనాద్కట్, జడేజాల ( Ashwin, Jaidev Unadkat, Jadejala )బౌలింగ్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.ఈ క్రమంలో అశ్విన్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ షాట్ ఆడడం ఇక్కడ వీడియోలో మనం చూడవచ్చు.

రివర్స్ స్వీప్ ఆడేందుకు కోహ్లీ పెద్దగా ఇష్టపడడు.అతడి బ్యాటింగ్ లో ఆర్థడాక్స్ షాట్స్ మాత్రమే ఉంటాయి.

అయితే తొలిసారి కోహ్లీ రివర్స్ స్వీప్ ట్రై చేస్తూ కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.రానున్న సిరీస్ లో కోహ్లీ దుమ్ములేపుతాడని కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతున్నారు.

ఇకపోతే, ప్రస్తుతం కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం గమనించవచ్చు.ఆగస్టు 13 వరకు ఈ సిరీస్ జరగనుంది.టి20 సిరీస్ కోసం బీసీసీఐ( BCCI ) ఇంకా జట్టును ప్రకటించాల్సి ఉంది.ఈ సిరీస్ అనంతరం భారత్ ఐర్లాండ్ తో టి20 సిరీస్ ఆడనుంది.

ఆ తరువాత ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ లో పాల్గొంటుంది.అనంతరం ఆస్ట్రేలియాతో ఒక చిన్నపాటి వన్డే సిరీస్ జరిగే అవకాశం ఉంది.

అనంతరం అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే వన్డే ప్రపంచకప్ లో పాల్గొంటుంది.కాగా ఈ సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube