మహారాష్ట్రలో క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి.అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలను హోటల్ కు తరలించారని తెలుస్తోంది.
ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలను హోటల్ తరలించారు.ఎన్సీపీ పార్టీ గుర్తు తమకే చెందుతాయంటున్న అజిత్ పవార్ ఎన్నికల సంఘాన్ని కలిసిన సంగతి తెలిసిందే.
జూన్ 30 న ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడుగా ఎంపిక అయ్యానని అజిత్ పవార్ చెబుతున్నారు.చాలా మంది సభ్యులకు సమాచారం ఇవ్వలేదని శరద్ పవార్ అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆ సమావేశం చెల్లదని పేర్కొన్నారు.అదేవిధంగా నిన్నటి బలప్రదర్శనలో అజిత్ పవార్ వైపు 32 మంది ఎమ్మెల్యేలు నిలవగా శరద్ పవార్ వైపు 13 మంది ఎమ్మెల్యేలు నిలిచారు.
అయితే 42 మంది ఎమ్మెల్యేల బలం ఉందని అజిత్ పవార్ తెలిపారు.మరోవైపు బల ప్రదర్శనల సమావేశాలకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు.







