ఈ-కామర్స్ కంపెనీల ట్రాప్‌లో పడకండి.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్

టెక్నాలజీ పెరగడం, ప్రతిఒక్కరి చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్ అనేది రావడంతో ప్రపంచమంతా మన చేతుల్లోకి వచ్చింది.ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇంటర్నెట్ ద్వారా తెలుసుకునే అవకాశం లభించింది.

 Govt Writes To Ecommerce Players To Stop Adopting Dark Patterns Details, E Comme-TeluguStop.com

అలాగే ఇంటర్నెట్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఎన్నో పనులు చేసుకోవచ్చు.ఏ పని అయినా అత్యంత వేగంగా పూర్తి చేసుకోవచ్చు.

ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ఈ-కామర్స్ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది.ఏ వస్తువు కావాలన్నా సరే ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే వెంటనే ఇంటికి డెలివరీ చేస్తున్నారు.

Telugu Amazon, Bigbasket, Bussiness, Central, Consumers, Dark Patterns, Commerce

ఇప్పటికే అమెజాన్,( Amazon ) ఫ్లిఫ్‌కార్ట్,( FlipKart ) నైకా, బిగ్ బాస్కెట్, రిలయన్స్ రిటైర్, మీషో, స్విగ్గీ లాంటి ఎన్నె వెబ్ సైట్లు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి.అయితే ఈ కంపెనీలు తమ సేల్స్‌ను పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి.రకరకాల ఆఫర్స్ ప్రకటిస్తూ అసలు ధర కంటే ఎక్కువ ధరకు తమ ప్రొడక్ట్స్‌ను ( Products ) కస్టమర్లు అంటకడుతున్నాయి.దీంతో ఆఫర్ల ట్రాప్‌లో పడి చాలామంది మోసపోతున్నారు.

అంతేకాకుండా బలవంతంగా కస్టమర్లతో వస్తువులు కొనుగోలు చేయిస్తున్నాయి.దీంతో ఇలాంటి కంపెనీకు తాజాగా కేంద్ర ప్రభుత్వం( Central Government ) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

కన్జ్యూమర్లను( Consumers ) ట్రాప్ చేసే చౌకబారు పనులు మానుకోవాలని సూచించింది.

Telugu Amazon, Bigbasket, Bussiness, Central, Consumers, Dark Patterns, Commerce

ఈ మేరకు అన్ని కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు పంపింది.యూజర్లను మోసం చేసే డార్క్ ప్యాటర్న్స్ డిస్కషన్స్ లేకుండా ఆపేయాలని హెచ్చరించింది.డార్క్ ప్యాటర్న్స్ అనేవి కస్టమర్లను గందరగోళానికి గురి చేస్తున్నాయి.

అవసరం లేకపోయినా సరే ప్రొడక్ట్ ను కొనేలా కస్టమర్లను బలవతం పెడతాయి.అలాగే కస్టమర్ల అనుమతి లేకుండా కార్ట్‌లోకి కొన్ని ప్రొడక్ట్స్, సర్వీసులను యాడ్ చేయడానికి డార్క్ ప్యాటర్న్స్ అనేవి ఉపయోగపడతాయి.

దీనిని ఉపయోగించి కస్టమర్లపై మైండ్ గేమ్‌కు కంపెనీలు పాల్పడుతున్నాయి.దీంతో ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది.

ఇలాంటి ట్రిక్‌లు నమ్మవద్దని చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube