పెళ్లి( Marriage ) అంటేనే ఒక తీయని వేడుక.జీవితంలో ఒకసారి మాత్రమే చేసుకునే ఈ వేడుకను అత్యంత గ్రాండ్‌గా చేసుకోవాలని చాలామంది భావిస్తూ ఉంటారు.
ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు, ఇక బంధుమిత్రులందరినీ పెళ్లికి ఆహ్వానిస్తారు.పెళ్లి అంటేనే బంధుమిత్రుల హడావుడితో సందడిగా ఉంటుంది.
ఇక స్నేహితులు, వధూవరుల డ్యాన్స్‌లతో పెళ్లి ఫంక్షన్‌లో సందడి ఉంటుంది.

పెళ్లి వేడుకకు వచ్చిన అతిధులు, స్నేహితులే కాదు.వాళ్లతో కలిసి వధూవరులు కూడా డ్యాన్స్ వేయడం ఇటీవల ఒక ట్రెండ్‌గా మారింది.తమ డ్యాన్స్‌లతో వధూవరులు అందరినీ ఆకట్టుకుంటున్నారు.
తమలోని డ్యాన్స్ టాలెంట్‌ను( Dancing Talent ) ఈ సందర్భంగా వధూవరులు బయటపెడుతున్నారు.దీంతో పెళ్లిలోని వధూవరుల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి.
తాజాగా అలాంటి ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.ఈ వీడియోలో ఒక వధువు వేసిన డ్యాన్స్ అందరినీ అలరిస్తుంది.

ఈ వీడియోలో వధువు( Bride ) అద్భుతంగా డ్యాన్స్ వేసింది.పంజాబీ విషాద గీతం సైయాన్ అనే పాటకు వధువు మాములుగా డ్యాన్స్ వేయలేదు.డ్యాన్స్ వేయడమే కాదు.ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ కూడా సూపర్బ్‌గా ఉన్నాయి.ది ఆర్ ఫోటోగ్రఫీ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.దీంతో వధువు డ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
నెటిజన్లు ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయిపోతున్నారు.ఇప్పటివరకు ఈ వీడియోను 76 లక్షల మంది వీక్షించారు.ఇక 4.5 లక్షల మంది లైక్ చేయగా.కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి.ఈ యువతిని సినిమాల్లోకి తీసుకోవాలని కొంతమంది కోరుతుండగా.ఈమె డ్యాన్స్ చూసి వరుడు ఇక ఏ రేంజ్‌లో సంతోషపడి ఉంటాడోనని కామెంట్స్ చేస్తున్నారు.







