తెలుగులో మంచి హీరోయిన్ గా పేరు పొందిన తమన్నా ( Tamanna )…ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సినిమాలు వెబ్ సీరీస్ లు చేస్తుంది…అయితే తమన్నా గత కొద్ది రోజులుగా విజయ్ వర్మ ( Vijay Varma ) తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే కొన్ని రోజులు అందరిలాగే ఈమె కూడా సీక్రెట్ గా తన ప్రేమ విషయాన్ని ఉంచి ఎట్టకేలకు ఆ విషయాన్ని బయటపెట్టింది.
అయితే ఈ మధ్యకాలంలో లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ విడుదలైంది.ఇందులో తమన్నా ఎప్పుడూ చూడని విధంగా రొమాంటిక్ సన్నివేశాలలో రెచ్చిపోయి నటించింది.

ఇక తమన్నా ను చూసి చాలామంది నెటిజన్స్ ఏంటి నిన్ను ఇంతకుముందు ఎప్పుడు ఇలా చూడలేదు.నీ అభిమానులమని చెప్పుకోవడానికి మాకే సిగ్గుగా ఉంది.మా పరువు తీస్తున్నావ్ అలాంటి సన్నివేశంలో నటించడానికి నీకు ఏమాత్రం సిగ్గు అనిపించలేదా.అంటూ చాలామంది నెటిజన్స్ ఆమెపై ఆగ్రహించారు.అయితే నెటిజన్స్ చేసిన కామెంట్లపై తమన్నా స్పందిస్తూ.విజయ్ వర్మ తో నేను జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను.
ఆయన చాలా మంచి వ్యక్తి.
ఆయన జీవితాన్ని ఎంతోమంది ప్రభావితం చేశారు అని నేను భావిస్తున్నాను.
అలాగే నేను చేసిన సన్నివేశాల గురించి చాలామంది నన్ను విమర్శిస్తున్నారు.కానీ ఇలాంటి సన్నివేశాలు హీరోలు చేస్తే ఒప్పుకుంటారు కానీ అదే హీరోయిన్ లు చేస్తే మాత్రం ఎందుకు సహించరో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.
ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు ఏంటో ఆలోచిస్తుంటేనే చాలా వెరైటీగా అనిపిస్తోంది.అయినా నేను నా కాబోయే వాడితోనే అలాంటి సన్నివేశాల్లో నటించాను కదా.

అలాంటప్పుడు సిగ్గెందుకు.ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు అంటూ తమన్నా తనని తాను సమర్ధించుకుంటూ సంచలన కామెంట్స్ చేసింది.ఇక తమన్నా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా ( Social media ) వేదికగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి.ఏది ఏమైనప్పటికీ ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు సినిమాల్లో ఓ రకంగా నటిస్తూ వెబ్ సిరీస్ లలో శృంగార భరిత సన్నివేశాల్లో నటిస్తూ విమర్శల పాలవుతున్నారు.
తమన్నా అంటే ఇన్ని రోజులు ఫ్యామిలీ జనాలు ఒక 100% లవ్ లాంటి సినిమాల్లో నటించిన మహాలక్ష్మి లాంటి క్యారెక్టర్ ఉన్న మనిషి అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఇలా సిగ్గులేకుండా నటించడమే కాకుండా పిచ్చి మాటలు మాట్లాడుతుంది అంటూ చాలా మంది సినీ అభిమానులు తమన్నా మీద నెగిటివ్ గా కామెంట్లు పెడుతూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు…
.







