మెగా కుటుంబానికి సంబంధించి ఏ చిన్న వార్త ప్రచారంలోకి వచ్చినా ఆ వార్త గురించి ఊహించని స్థాయిలో చర్చ జరుగుతుంది.మెగా ఫ్యామిలీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది.
ఊహించని స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబం కావడంతో ఈ కుటుంబాన్ని ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటారు.అయితే మెగా ఫ్యామిలీలో మరో విడాకులు చోటు చేసుకోవడం సోషల్ మీడియా(Social media )లో హాట్ టాపిక్ అవుతోంది.
మెగా కుటుంబంలోని ఆడపిల్లలకు పెళ్లిళ్లు కలిసిరావడం లేదని కొంతమంది ప్రచారం చేయడం గమనార్హం.అయితే ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించే విషయంలో చిరంజీవి ముందువరసలో ఉంటారు.
ఝాన్సీ తన భర్తతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్న సమయంలో చిరంజీవి మూడు గంటల పాటు సర్దిచెప్పే ప్రయత్నం చేశారని ఝాన్సీ మాజీ భర్త ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
మరి మెగా కుటుంబంలో ఏదైనా కారణం వల్ల ఒక జంట విడిపోవాల్సిన పరిస్థితి వస్తే చిరంజీవి కచ్చితంగా సర్దిచెప్పే ప్రయత్నం చేసి ఉంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కుటుంబంలో బంధాలు విడిపోవడం చిరంజీవి(chiranjeevi )ని ఎంతగానో బాధ పెడుతోందని తెలుస్తోంది.చిన్నచిన్న గొడవలు పెద్దవై మెగా కుటుంబంలో కొన్ని జంటలు విడిపోయే పరిస్థితి తలెత్తిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
చిరంజీవి ఎంత నచ్చజెప్పాలని ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఆయన ఏం చేయలేకపోయారని సమాచారం.మరోవైపు చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్( Bhola Shankar ) సినిమాలో నటిస్తున్నారు.ఆగష్టు నెల రెండో వారంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.మెహర్ రమేష్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.చిరంజీవి త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని కళ్యాణ్ కృష్ణ, వశిష్ట డైరెక్షన్లలో చిరంజీవి తర్వాత సినిమాలు తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది.మెగాస్టార్ రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.