టైటిల్ చూడగానే ఇప్పటికే విషయం మీకు అర్థమైపోయి ఉండొచ్చు.ఎస్వీ రంగారావు ( SV ranga rao )లాంటి మహానుభావుడు మన తెలుగు వారింట పుట్టడం మన వాళ్ళు చేసుకున్న అదృష్టం.
నిజానికి ఆయన హాలీవుడ్ నటుల కంటే ఏమాత్రం తీసిపోడు.అవకాశం వచ్చి ఉంటే హాలీవుడ్ ని కూడా ఒక దున్ను దున్నేసే వాడే.
కానీ ఆయన హాలీవుడ్( Hollywood ) కి వెళ్లక పోవడానికి చాలా కారణాలున్నాయి.ఆయన సమకాలికలు ఎంతో మంది రకరకాల భాషల్లో నటిస్తూ ఎన్నో కోట్లు వెనకేసుకున్నారు.
కానీ ఎస్వీ రంగారావు ఆ పని చేయలేదు.దానికి ఈగల ముఖ్య కారణాల విషయానికొస్తే మద్యపానం అలాగే మితిమీరిన అహంకారంతో పాటు క్రమశిక్షణ కూడా లేకపోవడం.

గొప్ప నటులు ఇద్దరే ఇద్దరు… ఒకరు శివాజీ గణేషన్ మరియు నందమూరి తారక రామారావు( N.T.Rama Rao ) వీరితోపాటు అనేక మంది ఉన్న వీరి కంటే ఎంతో కొంత కొన్ని విషయాల్లో కిందకే ఉంటారు.వీరిద్దరూ ఎవరితోనైనా పోల్చుకోవాలి అనుకుంటే కచ్చితంగా అది ఎస్వి రంగారావు మాత్రమే.
ఆయన నటనను చూసి వారు ఎంత కొంత నేర్చుకున్నాము అనే భావనలో ఉండేవారు.కోహినూరు వజ్రాన్ని దేనితోను పోల్చలేము కానీ ఎంతో మందిని ఆ వజ్రం తో పోలుస్తారు అలాంటి ఒక వ్యక్తి ఎస్వీ రంగారావు.
అంతటి ప్రతిభ ఉన్న రంగారావు కి వర్సటైల్ యాక్టర్ అనే పదం ఎంతో పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు.ఆయనే కనక తలుచుకొని ఉంటే తెలుగు కాదు అన్ని భాషల్లోను నటించేవాడు ఏకంగా హాలీవుడ్ లో కూడా కనిపించేవాడు.

పోయే వరకు వయసు కేవలం 52 లేదా 54 వరకు ఉండొచ్చు అలాగే ఆయన గొప్పగా నటించి మెప్పించిన పాత్ర అన్నీ కూడా ఆవయసు పాత్రలే కావడం గమనార్హం.ఆయన యువకుడిగా ఉన్న పాత్రలు ఒక్కటి కూడా కనిపించదు.50 కి పైగా వయసున్న పాత్రలోనే ఆయన వెండితెరపై కనిపించే సందడి చేశాడు.కాస్త క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వం కలిగి ఉన్నట్టై ఉంటే ఎస్వీ రంగారావు గురించి ఈరోజు మరోలా అందరి మాట్లాడుకునేవారు.
ఎంత తాగుతారో తెలీదు ఏం చేస్తారో తెలియదు సినిమా షూటింగ్ కి రమ్మని తొందర పెడితే ఏకంగా గన్నుతీసితే బెదిరిస్తారు.అంతలా ఆయన ముందుకు బానిస అయ్యారు కాబట్టే చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.








