స్టార్ హీరోలకు కూడా లేని దమ్ము వాణిశ్రీ సొంతం.ఎలాగో తెలుసా ?

వాణిశ్రీ( Vanisri ).నటి గా తన కెరీర్ ని ముగించిన వాణిశ్రీ కొన్నాళ్ల పాటు అవార్డుల కమిటీ లో మెంబర్ గా ఉన్నారు.

 Vanisri Angry On Awards Committees, Vanisri, Grahanam, Indraganti Mohana Krishn-TeluguStop.com

అయితే వాణిశ్రీ మొదటి నుంచి చాల నిక్కచ్చి అయినా మనిషి.ఆమె ఒక మాట అన్నారు అంటే అది వెనక్కి తీసుకునే అవకాశం లేదు.

అందువల్లే ఆమె నటిగా సక్సెస్ అయ్యారు అని అందరు చెప్పుకుంటారు.ఇక వాణిశ్రీ తాను నమ్మిన సూత్రం ఖచ్చితంగా పాటించే మనిషి.

ఎంతలా తన ఆస్థి కాజేసిన సొంత అక్క బావలపై కేసు వేసి నెగ్గి చివరికి వాళ్ళు అవసాన దశలో ఇంట్లో పెట్టుకొని సేవలు చేసింది.ఇక వాణిశ్రీ అవార్డుల కమిటీ లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది.

Telugu Grahanam, Tollywood, Vanisri-Movie

2004 లో మోహన కృష్ణ ఇంద్రగంటి( Indraganti mohana krishna ) తొలిసారి దర్శకత్వం వహించాడు.అయితే అవార్డుల కమిటీ కి ఈ చిత్రాన్ని పంపినప్పుడు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం లాంటి చాల అవార్డ్స్ కి నామినేట్ అయినా కూడా కేవలం తొలిసారి దర్శకత్వం వహించిన వారికి ఇచ్చే ఇందిరా గాంధీ అవార్డు మోహన కృష్ణ ఇంద్రగంటి కి ఇచ్చారు.

కానీ ఆ విషయంలో మోహన కృష్ణ ఇంద్రగంటి అన్యాయం జరిగింది అంటూ ఈనాడు పత్రిక కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భం లో వాణిశ్రీ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.గ్రహణం సినిమా( Grahanam movie )కు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డ్స్ కూడా రావాల్సింది కానీ అవార్డ్స్ కోసం కొంత మంది చేసిన లాబీయింగ్ వల్ల ఆ అవార్డ్స్ వేరే సినిమాకు వెళ్లాయని చెప్పారు.

Telugu Grahanam, Tollywood, Vanisri-Movie

వాణిశ్రీ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో ఇండస్ట్రీ లో పెద్ద దుమారాన్నే లేపాయి.ఆ ఏడాది అవార్డ్స్ అందుకున్న సినిమా లపై మీడియా తో పాటు కొంత మంది నటులు మరియు పెద్దలు కూడా తమ ఆగ్రహాన్ని తెలిపారు.ఏది ఏమైనా మొదటి నుంచి అవార్డ్స్ విషయంలో లాబీయింగ్ మాత్రమే నడుస్తుంది అని అందరికి తెలిసిందే.కానీ అన్ని తెలిసిన ఎవరు ఈ విషయం పై నోరు మెదపడానికి కూడా ఇష్టపడరు.

అలాంటి టైం లో వాణిశ్రీ ఎవరికి భయపడకుండా నిజాలను బయట పెట్టడం అనేది మాములు విషయం కాదు.అందుకే చాల మంది స్టార్ హీరోల కన్నా కూడా వాణిశ్రీ బెటర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube