నల్ల పసుపు( Black Turmeric ) గురించి మీరు ఎపుడైనా విన్నారా? దాదాపుగా విని వుండరు.సాధారణంగా పసుపు అనేది మనం నిత్యం వంటల్లో ఉపయోగించే ఒక దివ్యమైన పదార్థం.
ఎందుకంటే పుసుపు లేని కూరని మనం ఊహించలేం.కానీ, అదే పసుపులో నల్ల పసుపు రకం ఒకటుందని చాలా మందికి తెలియదు.
నల్ల పసుపు కొమ్ము ఎంతో మహిమాన్వీతమైంది అని ఋషులు చెప్పారు.ఈ కాలంలో దారి గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోయినా ప్రాచీన కాలం నుంచి నల్ల పసుపు తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది.
నల్ల పసుపు మామూలు పసుపు కంటే అధిక శక్తివంతమైంది కూడా.ఇంగ్లీషులో దానిని బ్లాక్ టర్మరిక్ లేదా శాస్త్రీయ నాయం కుర్క్యూమా క్యాసియాతో పిలుస్తారు.

నల్ల పసుపు అరుదైన పసుపు జాతికి( Rare Turmeric Species ) చెందిన అంతరించిపోతున్న మొక్కగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.అందుకే నల్ల పసుపును అమ్మడం, ఇళ్లలో పెంచడం భారత అటవీ చట్టం ప్రకారం నేరం.నల్ల పసుపు మొక్కను నేలకంఠ, నడకచోరా, కృష్ణకేతారా అని వివిధ రాష్ట్రాల వారు పిలుస్తారు.ఈ నల్ల పసుపును ముఖ్యంగా తాంత్రిక పూజలు, వశీకరణ, ధనాకర్షణ కోసం విరివిగా ఉపయోగిస్తారు.
మధ్య ప్రదేశ్ ప్రాంతంలోని నర్మదా నదీ( Narmada River ) తీర ప్రాంతం, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లోని తూర్పు కనుమలలో, నేపాల్ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అరుదుగా లభిస్తుంది.

ఇక ఈ నల్ల పసుపు లోపలి భాగం ముదురు నీలం, నలుపు రంగును కలిగి ఉంటుందన్నమాట.నల్ల పసుపు చెట్టు అచ్చం పసుపు చెట్టు లాగే ఉంటుంది, దాని బట్టే ఆ మొక్క నల్ల పుసుపు మొక్కగా గుర్తిస్తారు.ఈ మొక్క పువ్వు ముదురు గులాబీ రంగులో ఉండడం చాలా ప్రత్యేకతని కలిగి ఉంటుంది.
బెంగాల్లో ఈ మొక్కలను పండిస్తారు, ఆ నల్ల పసుపును సౌందర్య వస్తువుల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు.అదేవిధంగా నల్ల పసుపును కాళీమాత పూజలో ఎక్కువడ వాడటం వల్ల హిందీలో ఈ పసుపునకు కాళీ హాల్దీ అనే పేరొచ్చింది.
నల్ల పసుపుపై గిరిజనులకు అనేక నమ్మకాలున్నాయి.నల్ల పసుపు కొమ్ములు గుమ్మానికి వేలాడదీస్తే.దుష్ట శక్తులు దరిచేరవని నమ్ముతారు.అంతేకాకుండా నల్ల పసుపు సాక్షాత్తూ అమ్మ వారి స్వరూపమని వారు నమ్ముతారు.








