ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ”పుష్ప ది రూల్”.ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇస్తున్న అప్డేట్ లతో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.
ఇటీవలే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసారు.

సౌత్ కంటే కూడా నార్త్ ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో సుకుమార్ కూడా ఎక్కడ అంచనాలు తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు.ప్రజెంట్ ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది.మంచి హైప్ పెంచేసుకున్న ఈ సినిమా నుండి ఇప్పుడు క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.
అందులోను పార్ట్ 1 భారీ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై ఇంకా క్రేజ్ పెరిగింది.
తాజాగా పుష్ప 2 సినిమా( Pushpa 2 )కు సంబంధించిన వైరల్ అవుతున్న వార్త ఏంటంటే.
ఈ సినిమాలో పుష్పరాజ్ అలాగే భన్వర్ సింగ్ షెకావత్( Bhanwar Singh Shekawat ) మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది అని టాక్.పార్ట్ 1 లో కూడా వీరిద్దరి మధ్య కీలక సన్నివేశాలు జరుగగా అవి ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక ఇప్పుడు సీక్వెల్ లో కూడా వీరి మధ్య నెక్స్ట్ లెవల్లో యుద్ధం ఉండబోతుంది అని తెలుస్తుంది.

ఇప్పటికే భన్వర్ సింగ్ షూట్ ముగించినట్టు అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఇక ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ కావడంతో పుష్ప 2 పై మరింత క్రేజ్ పెరిగిపోతుంది.ఈ రోల్ లో ఫహద్ ఫాజిల్( Fahadh Faasil ) నటిస్తున్న విషయం విదితమే.
ఈయన నటన పార్ట్ 1 లోనే టీజర్ లెక్క చూపించగా ఇప్పుడు పార్ట్ 2 లో ఫుల్ మీల్స్ వడ్డించేందుకు సుక్కూ ప్లాన్స్ రెడీ చేస్తున్నాడు.రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాల్సిందే.







