తెలంగాణలో గ్రూప్స్ పరీక్ష నిర్వహణలో భాగంగా గతంలో పేపర్ లీకేజ్ ఘటన ఎంతో వివాదంగా మారింది.అయితే ఈసారి మాత్రం ఇలాంటి లీకేజ్ ఘటనలకు ఏమాత్రం అవకాశం లేకుండా తెలంగాణ సర్కార్ గ్రూప్ పరీక్షలను ఎంతో పకడ్బందీగా నిర్వహించింది.
ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో గ్రూప్4( Group 4 ) పరీక్షలను నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ పరీక్షలలో భాగంగా బలగం సినిమా( Balagam Movie) నుంచి ప్రశ్న రావడం ఆసక్తికరంగా మారింది.
జబర్దస్త్ కమెడియన్ వేణు ( Venu ) డైరెక్టర్ గా మారి బలగం అనే సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది.

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ సినిమా తెరకెక్కడంతో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.ఈ విధంగా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ సినిమా నుంచి కొన్ని ప్రశ్నలు పరీక్ష పత్రాలలో రావడం అందరిని ఆకట్టుకుంటుంది గతంలో పోలీస్ కానిస్టేబుల్( Police Conistable ) పరీక్ష పత్రాలలో కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.తాజాగా తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 4 పరీక్ష పత్రాలలో కూడా బలగం సినిమా నుంచి ప్రశ్న రావడంతో ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది.

గ్రూప్ ఫోర్ పరీక్ష పత్రాలలో అడిగిన ప్రశ్న ఏంటి అనే విషయానికి వస్తే… బలగం చిత్రానికి సంబంధించిన క్రింది జతలలో ఏవి సరిగా జతపరచబడినవి? అనే ప్రశ్నకు ఏ.దర్శకుడు : వేణు యెల్దండి, బి.నిర్మాత : దిల్ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి సి.సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, డి.కొమురయ్య పాత్రను పోషించినవారు : అరుసం మధుసూదన్.దీనికి సమాధానం ఏ,బీ,సీ, ఈ విధంగా బలగం సినిమాకు సంబంధించి ఈ ప్రశ్న రావడంతో బలగం చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రూప్ ఫోర్ పరీక్ష పత్రాలలో ఈ సినిమాకు సంబంధించిన ప్రశ్న రావడంతోనే ఈ సినిమా ఏ విధమైనటువంటి ఆదరణ సంపాదించుకుందో అర్థమవుతుంది.