స్టార్ డైరెక్టర్ రాజమౌళి గొప్ప డైరెక్టర్ అయినా ఆయన ఈ స్థాయికి చేరుకోవడం వెనుక తండ్రి విజయేంద్ర ప్రసాద్ కష్టం ఎంతో ఉంది.విజయేంద్ర ప్రసాద్ 1942 సంవత్సరంలో జన్మించారు.
ఆయన వయస్సు ప్రస్తుతం 81 సంవత్సరాలు కావడం గమనార్హం.అయితే ఆయన తెలివికి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
మలుపులతో కథ రాసుకోవడం కంటే ఆ మలుపులు ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉండటం సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తుంది.
స్టూడెంట్ నంబర్ వన్, మర్యాద రామన్న మినహా రాజమౌళి మిగతా సినిమాలకు దాదాపుగా విజయేంద్ర ప్రసాద్ కథలు అందించారు.
సింహాద్రి( Simhadri )ఇంటర్వెల్ ట్విస్ట్, ఛత్రపతిలో తల్లి కొడుకు మధ్య అనుబంధం, విక్రమార్కుడులో విక్రమ్ సింగ్ రాథోడ్ రోల్, మగధీరలో ప్రేక్షకుల ఊహలకు అందని కథ, కథనాలు, బాహుబలి సినిమాలో( Baahubali ) కట్టప్ప ట్విస్ట్ విజయేంద్ర ప్రసాద్ ప్రతిభకు నిదర్శనం అని చెప్పవచ్చు.

విజయేంద్ర ప్రసాద్ ఎంత టాలెంటెడ్ అంటే సాధారణంగా నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా అసాధారణమైన సినిమాలను తెరకెక్కించడం ఈ రచయితకు సాధ్యం కావడం గమనార్హం.రాజమౌళి( Rajamouli ) కెరీర్ తొలినాళ్లలో సక్సెస్ కావడం విషయంలో విజయేంద్ర ప్రసాద్ సహకారం ఎంతో ఉంది.విజయేంద్ర ప్రసాద్ వయస్సు 81 అయినా మనస్సు మాత్రం 21 సంవత్సరాల వ్యక్తిలా ఆలోచిస్తుంది.

విజయేంద్ర ప్రసాద్ సీన్లలో కొన్ని సీన్లు కాపీ అని కామెంట్లు వినిపించినా తాను స్పూర్తి తీసుకుంటానని బహిరంగంగా చెప్పగల వ్యక్తి విజయేంద్ర ప్రసాద్ అని చెప్పడం గమనార్హం.విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో పలు సినిమాలు తెరకెక్కినా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడంలో ఫెయిలయ్యాయి.మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సైతం విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.విజయేంద్ర ప్రసాద్ కు రాబోయే రోజుల్లో సైతం విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.







