ఒకవైపు ఫ్రాన్స్( France ) నిరసనలతో తగలబడుతుండగా.మరోవైపు కొంతమంది వైఖరి విచిత్రంగా ఉంది.
ఫ్రాన్స్‌లోని పారిస్‌తో పాటు మరికొన్ని నగరాల్లో ఆందోళనలు గత కొంతకాలంగా వ్యక్తమవుతుండగా.ఇదే అదునుగా చూసుకుని కొంతమంది ఐఫోన్లు, బైక్స్, కార్లు ( iPhones, bikes, cars )లూటీ చేస్తోన్నారు.
వందల సంఖ్యలో కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి మాల్స్, షాపింగ్స్ మాల్స్ దగ్గర బీభత్సం సృష్టిస్తున్నారు.వాహనాలు తగలబెడుతూ వీరంగం సృష్టిస్తున్నారు.
వాహనాలు తగలబెడటంతో మంటలు వచ్చి పెద్ద ఎత్తున పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేస్తున్నాయి.దీంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదే క్రమంలో యువకులు షాపింగ్స్ మాల్స్, షాపుల్లోకి చొరబడి అందినకాడికి దొచుకుంటున్నారు.గత మూడు రోజులుగా పారిస్‌లో ఇలాంటి తరహా చోరీలు కామన్ అయిపోయాయి.ఇటీవల పారిస్ సిటీలో కొంతమంది యువకులు ఒక సెల్‌ఫోన్ షాపుపై దాడికి దిగారు.అనంతరం షాపులోని ఐఫోన్లతో పాటు దొరికిన ఫోన్లను చోరీ చేసి తీసుకెళ్లారు.
ఒక మరో ప్రాంతంలో ఒక బైక్ షోరూంపై కొంతమంది యువత ముఠాగా ఏర్పడి దాడికి పాల్పడ్డారు.అనంతరం విలువైన బైక్‌లను తీసుకెళ్లిపోయారు.వీటిల్లో విలువైన లగ్జరీ, స్పోర్ట్స్ బైక్ ( luxury, sports bike )లు ఉన్నాయి.అలాగే మరోచోట ఒక కార్ల షోరూంపై దాడి చేసి కార్లు తీసుకెళ్లిపోయారు.

బహిరంగంగా దోపిడీ చేయడమే కాకుండా దాడి చేసి వస్తువులను ఎత్తుకెళ్లిన ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం గమనార్హం.ఇటీవల 17 ఏళ్ల నహేల్( Naheel ) అనే యువకుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు.దీంతో యువకులు దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు.ఈ ఆందోళనలో పాల్గొంటున్నవారిలో యువతే ఎక్కువగా ఉన్నారు.దీంతో టీనేజర్లను ఇంట్లోనే ఉంచాలని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సూచించారు.







