కొన్ని దేశాల్లో జననాల రేటు భారీగా తగ్గిపోతుంది.దీంతో అక్కడి ప్రభుత్వాలు పిల్లలను కనేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి.
అందులో భాగంగా అనేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి.చైనా, జపాన్( China, Japan ) తో పాటు పలు దేశాల్లో జననాల రేటు భారీగా పడిపోయింది.
పెళ్లి చేసుకునేందుకు, పిల్లలను కనేందుకు చాలామంది యువత ఆసక్తి చూపడం లేదు.దీంతో జననాల సంఖ్య తక్కువగా ఉన్న దేశాలు యువత తీరుతో ఆందోళనకు గురవుతున్నాయి.
ఈ క్రమంలో పిల్లలను కనేలా వారిని ప్రోత్సహిస్తున్నాయి.

ఈ క్రమంలో చైనాలోని( China ) ఒక ట్రావెల్ కంపెనీ వినూత్నమైన ఆఫర్ ప్రకటించింది.తమ ఉద్యోగుల కోసం ఆ కంపెనీ ప్రత్యేకమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది.పిల్లలను కంటే 50 వేల యూవాన్లు( 50 thousand yuan ) ఇస్తామని ప్రకటించింది.అంటే ఇండియన్ కరెన్సీలో 5.66 లక్షలు అన్నమాట.జులై 1 నుంచి పిల్లలను కనే ఉద్యోగులకు ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ ట్రావెల్స్ ఏజెన్సీలలో ట్రిప్.కామ్ ( trip.com )ఉంది.ఈ కంపెనీ తమ ఉద్యోగులకు ఈ ఆఫర్ ప్రకటించింది.దీంతో ఇప్పుడు ఈ వార్త ఆసక్తికరంగా మారింది.
జననాల రేటును పెంచేందుకు ఇలా చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు జన్మించిన బిడ్డకు 5 సంవత్సరాల పాటు ప్రతి ఏడాది 10 వేల యువాన్లు అందించనున్నట్లు ట్రిప్.కామ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జేమ్స్ లియాంగ్ తెలిపారు.ఇక తల్లిదండ్రులకు సబ్సిడీ కూడా ఉంటుందని ఆయన చెప్పారు.ఇందుకోసం కంపెనీ 1 బిలియన్ యువాన్ ఖర్చు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.పిల్లలను కనేలా ప్రైవేట్ కంపెనీలన్ని ప్రోత్సహించాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఇప్పటికే ప్రభుత్వానికి కూడా తాను కొన్ని సూచనలు చేసినట్లు చెప్పుకొచ్చారు.







