కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.కాజీపేటలో వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపును అప్ గ్రేడ్ చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపును వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మారుస్తున్నట్లు ప్రకటించింది.
ఈ క్రమంలోనే ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాగన్ ఉత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు.