సోషల్ మీడియా అనేది అందుబాటులోకి వచ్చాక వింత వింత విషయాలు బయట పడుతూ వున్నాయి.వాటిని చూసినప్పుడు వెంటనే అర్థం కావు కానీ, అసలు విషయం తెలిశాక మాత్రం ఆశ్చర్యపోవడం అందరి వంతు అవుతుంది.
మనకెందుకు అలాంటి ఐడియా రాలేదు? అని నోరు కరుచుకున్న పరిస్థితి వస్తుంది.ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో అలానే అనిపిస్తోంది.
డాబా మీద టీవీ యాంటినాకు ప్లాస్టర్లు వేసి మరీ ఓ ప్లాస్టిక్ డబ్బాను( plastic box ) చుట్టడం ఈ పోస్టులో చూడవచ్చు.దీని వెనుక ఉన్న కారణం తెలిసి ‘కామన్ మ్యాన్ ట్యాలెంట్ ఇలాగే ఉంటుంది’అని కొందరు కితాబులిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, మనిషికి అవసరం అన్నిటినీ నేర్పిస్తుంది.ఇబ్బందులకు గురి అయినప్పుడే మనిషి తెలివి తేటలు పదునెక్కుతాయి.
సాధారణంగా వర్షాకాలంలో డిష్ సిగ్నల్స్ అస్తవ్యస్తమై టీవీ చూడటం చాలా కష్టంగా మారుతుంది.ఓ వ్యక్తి తన మేడ మీద ఉన్న డిష్ నుండి సరైన సిగ్నల్స్ పొందడానికి తెలివిగా ఆలోచించాడు.
అతను యాంటీనాను( Antena ) ఓ పొడవాటి ప్లాస్టిక్ డబ్బాతో కవర్ చేశాడు.అది స్ట్రాంగ్ గా నిలిచి ఉండటానికి దానికి ఓ మందం పాటి పొర వచ్చేలా దాని మూతి భాగానికి ప్లాస్లర్ చాలా గట్టిగా అతికించాడు.
దీంతో గాలి, వాన వంటివి వచ్చినా ఆ యాంటినాకు ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వదు.హాయిగా సిగ్నల్స్ అందుతాయి.
అదేరకంగా ఇబ్బంది లేకుండా ఇంట్లో టీవీ చూడచ్చు.

ఈ ఫోటోను నరేందర్( Narender ) అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేయగా ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.‘ఎయిర్టెల్ డిటిహెచ్ కస్టమర్ కేర్ ఈ వర్షాకాలంలో పనికిరాదు, దాన్ని కాపాడుకోవడం కోసమే ఈ ప్రయోగం’ అనే అర్థం వచ్చేలా ఈ పోస్టుకి క్యాప్షన్ పెట్టడం కొసమెరుపు.వర్షాకాలం నడుస్తోంది కాబట్టి ఇప్పుడీ ప్రయోగం నెటిజన్లను చాలా తీవ్రంగా ఆకర్షిస్తోంది.దాంతో నెటిజన్లు చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.‘వర్షాకాలంలో సిగ్నల్స్ మేఘాల కారణంగా పోతాయి కానీ వర్షం వల్ల కాదు.కాబట్టి ఈ ప్రయోగం వల్ల ఫలితం ఉండదు’ అని కొంతమంది కామెంట్స్ చేస్తే, కొందరు మాత్రం ‘వర్షానికి తడవకుండా యాంటినాను కాపాడటంలో ఈ ప్రయోగం బాగానే పనిచేస్తుంది’అని కామెంట్స్ చేస్తున్నారు.







