'ఇండియన్ 2' కోసం రెండు డేట్స్.. ఈసారి రిలీజ్ మిస్ అయ్యేది లేదట!

కమల్ హాసన్ ( Kamal haasan ) ఎన్నో ఏళ్ల తర్వాత ‘విక్రమ్’ ( Vikram movie )సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫామ్ లోకి రావడంతో అదే ఊపులో రెండేళ్ల క్రితం ఆగిపోయిన ‘ఇండియన్ 2’ ( Indian 2 ) సినిమాను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ ఏడాది సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు.రెండేళ్ల క్రితం ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ మూవీ అనేక కారణాల వల్ల రెండేళ్ల పటు వాయిదా పడింది.

 Kamal Haasan Indian 2 Release Update, Kamal Haasan, Indian 2, Kajal Agarwal, Sha-TeluguStop.com

ఈ సినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది.అప్పట్లో శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అందుకే ఇన్నేళ్ల తర్వాత ఇదే కాంబోలో సినిమా అంటే ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభిస్తుంది.ఎట్టకేలకు ఈ ఏడాది కమల్ హాసన్, శంకర్ ఈ సినిమాను మళ్ళీ సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు.

ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా. అనిరుద్ రవిచంద్రన్ ( Anirudh Ravichander ) సంగీతం అందిస్తున్నారు.కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా షూట్ ఆల్మోస్ట్ పూర్తి చేసాడు శంకర్.దీంతో రిలీజ్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.మరి ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ తెలుస్తుంది.

ఈ సినిమా కోసం రెండు డేట్స్ ను ఫైనల్ చేసి పెట్టారట.కోలీవుడ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ 2024 లో సమ్మర్ కానుకగా రిలీజ్ కానుందట.ఏప్రిల్ 11 కానీ 26 కానీ రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట.మరి అధికారిక ప్రకటన కూడా అతి త్వరలోనే రాబోతుందని ఈ రెండు డేట్ లలో ఒక డేట్ ఫిక్స్ చేయనున్నట్టు అక్కడి మీడియా చెబుతుంది.

చూడాలి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube